ఆంధ్రప్రదేశ్‌

అరాచక శక్తుల పట్ల అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: బంద్ సందర్భంగా అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక హోదా, తదితర అంశాలపై కేంద్రం వైఖరికి నిరసనగా సోమవారం వివిధ రాజకీయ పక్షాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ అధికారులతో ఆదివారం రాత్రి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర బంద్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జనజీవనానికి ఇబ్బంది లేకుండా నిరసనను శాంతియుతంగా తెలియజేసేలా చూడాలన్నారు. అరాచక శక్తులపై దృష్టి పెట్టాలని, సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా ఉంచాలన్నారు. ఇది సున్నితమై అంశమని, అందుకు నిరసన కూడా సున్నితంగానే ఉండాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మన పోరాటం కేంద్రంపై అని, మన నిరసనలు ఢిల్లీలో తెలపాలన్నారు. రాష్ట్రం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, బంద్‌తో మరింత ఇబ్బందులపాలు చేయవద్దని పిలుపునిచ్చారు. సంయమనం పాటించి శాంతియుతంగా బంద్ పాటించాలని, మన హక్కులు సాధించుకోవాలన్నారు. రాష్ట్రానికి నష్టం లేకుండా న్యాయం జరిగేలా నిరసన ఉండాలని ఆందోళనకారులను ముఖ్యమంత్రి కోరారు.