ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర బంద్‌కు ప్రజాసంఘాల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా 5 కోట్ల మంది ఆంధ్రులను నిట్టనిలువునా దగా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు వివిధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌ను సంపూర్ణం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసిన విపక్షాలు తెల్లవారుఝామున 5 గంటలకే నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్, విద్యాధరపురం ఆర్టీసీ డిపోల వద్ద పికెటింగ్ జరిపేందుకు కార్యాచరణ సిద్ధం చేశాయి. అలాగే ఉదయం 9.30 గంటలకు గవర్నర్‌పేట లెనిన్ సెంటర్, పాతబస్తీ కాళేశ్వరరావు మార్కెట్, పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ర్యాలీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, ఆమ్ ఆద్మీ, లోక్‌సత్తా, తదితర పక్షాలతో పాటు సుమారు 20 ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, వ్యాపార, వాణిజ్య రంగాలు, వివిధ అసోసియేషన్లు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టు యూనియన్లు కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ బంద్‌కు ప్రజలందరూ సహకరించడమే కాకుండా బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలని విపక్ష నేతలు కోరారు. బంద్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిఘా వర్గాల సూచనల మేరకు పోలీసులు భారీ బందోబస్తు, పికెట్లు ఏర్పాటు చేశారు. గతంలో విపక్షాల హోదా బంద్‌కు వ్యతిరేకంగా పనిచేసిన అధికార పార్టీ నేతలు ఈసారి ఇతోధికంగా సహకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది.