ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళం ఎంపీ మెరుపు ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 16: ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు సోమవారం రాత్రి ఆకస్మిక ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపైనే దీక్షకు కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగానే ఈ మెరుపు దీక్షకు దిగినట్టు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, పలువురు టీడీపీ నేతలు సంఘీభావంగా ఆయనతోపాటు ప్లాట్‌ఫారంపై దీక్షకు కూర్చున్నారు. సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి మంగళవారం ఉదయం ఏడు గంటల వరకూ ఈ దీక్ష కొనసాగిస్తారు. రాత్రి ప్లాట్‌ఫారం మీదే పడుకుని మంగళవారం రోజు స్టేషన్‌లోనే నిరసన తెలియజేస్తారు. ఒడిశా ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎటువంటి అభ్యంతరాలు లేవని తేల్చిచెప్పినప్పటికీ మోదీ సర్కార్ స్పష్టత ఇవ్వడం లేదని, ప్రత్యేక రైల్వే జోన్ పట్ల సుస్పష్టమైన హామీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రత్యేక రైల్వే జోన్ ఉద్యమానికి ఈ ఫ్లాట్‌ఫారం నిరసన దీక్ష ఆరంభమని పేర్కొన్నారు. ఇటువంటి దీక్షలు రాష్టమ్రంతటా అన్ని జిల్లాల్లో రైల్వే స్టేషన్ల ఫ్లాట్‌ఫారాలపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తానంటూ అల్టిమేటం ఇచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రులకు ప్రధాని తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మాటకు జవాబు ఇవ్వాల్సివుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఏపీలో కొన్ని రాజకీయ పార్టీలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.