ఆంధ్రప్రదేశ్‌

మున్సిపాల్టీల్లో ఆర్థిక ప్రతిష్ఠంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: రాష్ట్రంలోని మున్సిపాల్టీలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ చెల్లింపులు నిలిపివేసింది. ఏప్రిల్ మాసంలోకి వచ్చినా ఇంకా ఆర్థిక శాఖ అనధికార ఆంక్షలు నడుస్తూనే ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్‌ఎంఎస్) ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా నడుస్తోంది. ఇప్పటి వరకు సిఎఫ్‌ఎంఎస్ విధానం ద్వారా ఒక్క చెల్లింపును కూడా ఆర్ధిక శాఖ చేయలేదు. దీంతో మున్సిపాల్టీలు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు సుమారు రూ.700 నుంచి రూ.800 కోట్లు వరకు వివిధ రూపాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ మొత్తం మార్చి 31 వరకు మాత్రమే. ఏప్రిల్ మాసంలో సగం రోజులు గడిచిపోయాయి. దీంతో చెల్లించాల్సిన మొత్తం కొండలా పెరిగిపోతోంది. ముఖ్యంగా మున్సిపాల్టీల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే బిల్లు కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాటర్ సప్లయ్, హెడ్‌వాటర్‌వర్క్స్, టెక్నికల్, నాన్ టెక్నికల్, విద్యుత్ బిల్లులు, ఆయిల్ బిల్లులు, వాహనాల రిపేర్లు, అద్దెలు, అభివృద్ది పనుల బిల్లులు, నిలిచిపోయాయి. వీటికి తోడు రాష్ట్రంలో అమృత్ పథకం పనులు జరుగుతున్న మున్సిపాల్టీల్లో ఆయా పనులకు చెల్లించాల్సిన బిల్లులు కూడా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖలో గతంలో ఉన్న విధానానికి స్వస్థిచెప్పి, సంస్థాగత వనరుల ప్రణాళిక (ఈఆర్‌పీ)కు శ్రీకారం చుట్టింది. 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2011లో డబుల్ ఎంట్రీ విధానాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. అదే సమయంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) విధానాన్ని కూడా అమలుచేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అకౌంటెంట్, జేఏవో, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్‌లను కూడా సర్వీసు కమిషన్ ద్వారా నియమించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన కార్వీ సంస్థను తెరమీదకు తీసుకువచ్చింది. ఆ సంస్థ సిఫార్సు మేరకే ఈఆర్‌పీ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న మున్సిపాల్టీల డిపాజిట్లను ఖజానా శాఖలోనే ఉంచాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఇదే సమయంలో మున్సిపాల్టీలకు అధికారాలు లేకుండాచేసి, ఖజానాశాఖ చెల్లింపుల విధానానికి ఏర్పాటుచేసిన వెబ్‌సైట్‌ను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని సీఎఫ్‌ఎంఎస్‌ను కొత్తగా తెరమీదకు తీసుకువచ్చింది. ఈ నూతన విధానానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టినా ఇంకా ఒక్క రూపాయి కూడా చెల్లింపులు జరగలేదు. సీఎఫ్‌ఎంఎస్ విధానంపై మున్సిపాల్టీలకు అవగాహన లేదు. కనీసం ప్రభుత్వం ఆ వెబ్‌సైట్‌ను లాగిన్ చెయ్యడానికి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ కూడా ఇవ్వలేదు. దీంతో మున్సిపాల్టీలో కోట్లాది రూపాయల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇక సీఎఫ్‌ఎంఎస్ విధానం ద్వారా మేకర్, చెక్కర్, సబ్‌మిటర్ పూర్తిగా పరిశీలన జరిగిన తర్వాతే ఆర్‌బీఐ ద్వారా ఏర్పాటుచేసిన ఈ-కుబేర్ ద్వారా చెల్లింపులు ఆన్‌లైన్ అంటే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ద్వారా చెయ్యాల్సి వుంటుంది.