ఆంధ్రప్రదేశ్‌

కాల్‌మనీపై అసెంబ్లీలో వైకాపా ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాల్‌మనీ పేరిట వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచకాలపై తక్షణం చర్చించాలని ఎ.పి. అసెంబ్లీలో వైకాపా సభ్యులు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. గురువారం ఉదయం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన వెంటనే కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ డిమాండ్ చేశారు. ఐతే ఈ విషయమై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి, స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాల అంశాన్ని చేపట్టారు. కాల్‌మనీపై శుక్రవారం ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందని అప్పుడే ఈ విషయమై చర్చించేందుకు అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సభలో టిడిపి, వైకాపా ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.