రాష్ట్రీయం

తడబడిన తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ - విద్యారంగం :2015
================
రాష్ట్రం ఒకచోట, పాలన మరొకచోట ఉండటంతో సమస్యలు అన్నీఇన్నీ కాదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో చదువుకుంటుండం వల్ల వారి సంక్షేమాన్ని సైతం పట్టించుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండటం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరైన సఖ్యత కొరవడటంతో అనేక ఇబ్బందులు పడింది. తర్వాత్తర్వాత కోలుకున్న ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. స్కూళ్లలో నైతిక విలువలను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు నాయకత్వంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా కరిక్యులమ్‌లో చేర్పులు మార్పులు చేపడతారు. రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు కావడం, ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును ఆమోదించడం ద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
=================
ఆంధ్రప్రదేశ్ విద్యారంగం రానున్న రోజుల్లో దివ్యమైన భవిష్యత్‌ను చవిచూడబోతున్నా తొలి అడుగుల సమస్యలను మాత్రం ఈ ఏడాది ఎదుర్కొంది. రాష్ట్రం అంతా అక్కడా, పాలనాధికారులు అంతా హైదరాబాద్‌లో ఉండటంతో సమస్యలు అన్నీ ఇన్నీ కాదు, మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో చదువుకుంటుండం వల్ల వారి సంక్షేమాన్ని సైతం పట్టించుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండటం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరైన సఖ్యత కొరవడటంతో అనేక ఇబ్బందులు పడింది. రాష్టస్థ్రాయి యూనివర్శిటీలైన అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్షలను నిలిపివేయడం, తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రాకు చెందిన సిబ్బందిని వెనక్కు పంపించి వేతనాలు నిలిపివేయడం, ఎమ్సెట్ కేంద్రాల కేటాయింపులో సమస్యలు ప్రభుత్వానికి ఒక దశలో తలనొప్పిగానే తయారయ్యాయి. తర్వాత్తర్వాత కోలుకున్న ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు కావడం, డి.ఎస్సీ నిర్వహించుకోవడం, యూనివర్శిటీలకు విసిల నియామకం, పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు చైర్మన్‌ను నియమించుకోవడం, స్లెట్ నిర్వహణ బాధ్యత ఆంధ్రా యూనివర్శిటీకి అప్పగించి దానికో రూపాన్ని ఇవ్వడం, జాతీయ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు చేపట్టడం ద్వారా ఆంధ్రా విద్యార్థులకు భరోసా ఇవ్వగలిగింది.
ఇంకోపక్క ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును ఆమోదించడం ద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. బిర్లా తదితర కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు ఏర్పాటుకు కూడా వీలుకల్పించింది. రానున్న ఐదేళ్లలో 32 యూనివర్శిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం 6200 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రస్తుతానికి గుర్తించారు. సాఫ్ట్ బ్యాంకు 3వేల కోట్లతో 500 ఎకరాల్లో యూనివర్శిటీ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. 1500 కోట్లతో అమృత యూనివర్శిటీ, 500 కోట్లతో ఎస్‌ఆర్‌ఎం సంస్థ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 11 జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తోంది. వాటికి 10135 కోట్లు వ్యయం కానుంది. ఇప్పటికే కొన్న సంస్థలు ప్రారంభం అయ్యాయి. ప్రైవేటు సంస్థలు మరో 21 యూనివర్శిటీల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. తద్వారా 5886 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం వౌలిక సదుపాయాలు ఇతర వసతులకు 621 కోట్లు వెచ్చించనుంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని 2.72 లక్షల మంది విద్యార్ధులకు ప్రపంచస్థాయి విద్యావకాశాలు అందుబాటులో వస్తాయి.
ఈ ఏడాది తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటి, వైజాగ్‌లో ఎంబిఎ కాలేజీలు అడ్మిషన్లు ప్రారంభించాయి. అలాగే సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐటి, ఐఐఎస్‌ఇఆర్ విద్యాసంస్థలు తిరుపతి పరిసరాల్లో ఏర్పాటు కానున్నాయి. ట్రిపుల్ ఐటి కర్నూలులోనూ, ఎయిమ్స్ గుంటూరు-విజయవాడ సర్క్యూట్‌లోనూ, ఐఐఎస్‌సి అనంతపురం సర్క్యూట్‌లో, పెట్రోలియం యూనివర్శిటీ తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాల్లో, ట్రైబల్ వర్శిటీ శ్రీకాకుళం-విజయనగరం జిల్లాల్లో, వ్యవసాయ వర్శిటీ పశ్చిమ గోదావరిలోనూ, ఎన్‌ఐడిఎం కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటికీ భూ సేకరణ, నిధుల కేటాయింపు, వ్యవస్థాపక సదసపాయాల కల్పన తదితర అంశాలపై ప్రభుత్వం ఈ ఏడాది నిధులను కేటాయించి పనులను పురమాయించింది.
అన్నింటికీ మించి ఈ ఏడాది స్కూళ్లలో నైతిక విలువలను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టడం చాగంటి కోటేశ్వరరావు నాయకత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ స్కూళ్లలో విద్యార్ధుల్లో విలువలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు సూచనలు చేస్తుంది. తదనుగుణంగా కరిక్యులమ్‌లో చేర్పులు మార్పులు చేపడతారు.
యూనివర్శిటీల్లో ప్రధానంగా నాగార్జున వర్శిటీని పట్టిపీడించిన ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఒకటి రెండు సంఘటనలు జరిగిన తర్వాత కూడా అక్కడ ర్యాగింగ్ ఘటనలు నమోదుకావడం చూస్తుంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం అవుతోంది. కమిటీల మీద కమిటీలను వేసిన ప్రభుత్వం ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించిందే తప్ప గట్టి ధైర్యాన్ని మాత్రం విద్యార్థులకు ఇవ్వలేకపోయింది. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న మరో భూతం విద్యార్ధుల ఆత్మహత్యలు. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు నిరంతరం జరుగుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే స్పందిస్తున్న ప్రభుత్వం వాటి నివారణకు శాశ్వత చర్యలను మాత్రం చేపట్టలేకపోతోంది. దానికి కారణం విద్యారంగాన్ని శాసించే స్థాయికి కార్పొరేట్ సంస్థలు ఎదగడమే. అలాగే తెలంగాణ ఆధీనంలో ఉన్న వివిధ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంలో కూడా ఘోరంగా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి తెలుగు అకాడమి సంస్థ లేనే లేదు. అలాగే భాషకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశిష్ట్భాషా కేంద్రం ఊసే లేదు, తెలుగు యూనివర్శిటీ, ఓపెన్ యూనివర్శిటీలకు సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారా లేదా ఎలాంటి ఆలోచన ఉందనే విషయంలోనూ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత రాలేదు. దాంతో విద్యార్థుల్లో అయోమయం తొలగిపోలేదు. ఇంకో విషయం ఏమంటే తాజాగా రాజుకున్న అమెరికా చదువుల గోలపై కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇటీవల వెనక్కు వచ్చిన విద్యార్ధుల్లో ఆంధ్రాకు చెందిన వారున్నా తమకేమీ పట్టనట్టు ప్రభుత్వం వౌనంగా ఉండిపోవడం విశేషం. ఏదేమైనా ఈ ఏడాది ఆంధ్రాకు తీపి-చేదు గుళికగా చెప్పవచ్చు.

-బి.వి.ప్రసాద్