ఆంధ్రప్రదేశ్‌

రేపు ఎపి మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎంసెట్‌లో మెడికల్ విభాగానికి సంబంధించి ఫలితాలను శనివారం విడుదల చేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. ‘నీట్’ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్‌ను జారీ చేయడంతో మెడికల్ ఎంట్రన్స్ ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఆ ఆర్డినెన్స్‌తో పాటు ‘నీట్’పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేశాక ముఖ్యమంత్రితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎపి వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇక్కడి సిఎంఓలో ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను విడుదల చేస్తారు.