ఆంధ్రప్రదేశ్‌

ఎపి ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను శనివారం ఇక్కడ సిఎం చంద్రబాబు విడుదల చేశారు. తొలి పదిర్యాంకుల వివరాలను ఆయన ప్రకటించారు. ఇటీవల ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలను ప్రకటించినప్పటికీ, ‘నీట్’పై సుప్రీం కోర్టు తీర్పు అప్పటికి రానందున మెడికల్ ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ‘నీట్’ను ఈ ఏడాదికి మినహాయిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యలో ఈరోజు మెడికల్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు, ఎపి ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలను ఈ ఫలితాల ఆధారంగా పూర్తి చేస్తారు.