ఆంధ్రప్రదేశ్‌

శాసనసభ, మండలి నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు బుధవారం ముగిశాయి. రెండు సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. శాసనసభ 15 రోజుల పాటు కొనసాగింది. 86 గంటల 25 నిమిషాల పాటు అజెండా చేపట్టామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. టిడిపి 60 గంటలు, వైకాపా 21 గంటలు, బిజెపి నాలుగున్నర గంటల సమయాన్ని వినియోగించుకున్నాయి. 124 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు అంశాలపై ప్రకటనలు చేశారు. మొత్తం 10 బిల్లులకు ఆమోదం లభించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ఒక పర్యాయం, స్పీకర్‌పై మరోపర్యాయం వైకాపా అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించింది. ఈ రెండు తీర్మానాలు వీగిపోయాయి. ఇలా ఉండగా శాసన మండలి సమావేశాలను కూడా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ఎ. చక్రపాణి ప్రకటించారు.