ఆంధ్రప్రదేశ్‌

రూ.11492 కోట్లతో 160 టూరిజం ప్రాజెక్ట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: రాష్ట్రంలో 11492 కోట్ల విలువైన 160 ప్రాజెక్ట్‌లు రానున్నాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలియచేశారు. రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్ట్‌ల అమలు తీరుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సమావేశమైంది. సమావేశానంతరం యనమల విలేఖరులతో మాట్లాడుతూ 11492 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల్లో 3000 కోట్లు విలువైన ప్రాజెక్ట్‌లు గ్రౌండ్ అయ్యాయని అన్నారు.
1800 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు గ్రౌండింగ్‌కు దగ్గరగా ఉన్నాయని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో 3000 కోట్ల ప్రాజెక్ట్‌లు త్వరలోనే గ్రౌండ్ అవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో త్రీ స్టార్ హోటల్స్‌లో 7000 గదులు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయని, మరో 2730 గదులు అదనంగా అందుబాటులోకి రానున్నయని ఆయన తెలియచేశారు. గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రముఖ నగరాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం త్వరితగతిన జరుగుతోందని యనమల చెప్పారు. త్రీ స్టార్ హోటల్స్‌కు వ్యాట్ టాక్స్‌లో ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నామని యనమల ప్రకటించారు. విశాఖ, తిరుపతిల్లో హెలీ టూరిజం రాబోతోందని చెప్పారు. విజయవాడ దగ్గరనున్న కొండపల్లి కోటను 10.9 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. మంగినపూడి బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, అమరావతిలో బౌద్ధ స్థూపాన్ని నిర్మించనున్నామని చెప్పారు. సూర్యలంక బీచ్‌ను సుందరీకరించనున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు బీచ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. 2015లో 91 మిలియన్ మంది పర్యాటకులు రాగా, ఈ ఏడాది 121 మిలియన్ మంది వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. పర్యాటకుల తాకిడిలో దేశంలో ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో ఉందని అన్నారు. 2014లో టూరిజం పాలసీని పూర్తిగా మార్చేశామని, దీనివలన ప్రాజెక్ట్‌లు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు.
భూముల స్వాధీనానికి ఆమోదం
విశాఖలోని కాపులుప్పాడ వద్ద ఉన్న హెల్తీ స్పాండ్ రిసార్ట్స్, షీలానగర్‌లోని హాస్పిసాలిటీ కాంప్లెక్స్‌కు ప్రభుత్వం గతంలో భూములు కేటాయించిందని, ఇందులో నిర్మాణాలు చేపట్టకపోవడం వలన ఆ భూములను కలెక్టర్ తిరిగి స్వాధీనం చేసుకున్నారని మంత్రి యనమల చెప్పారు. దీన్ని క్యాబినెట్ సబ్‌కమిటీ ఆమోదం తెలిపిందని ఆయన తెలియచేశారు. హెల్తీ స్పాండ్ రిసార్ట్స్‌కు కేటాయించిన 32 ఎకరాల స్థలంలో అతి పెద్ద కనె్వన్షన్ సెంటర్‌ను, ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వీటిని ప్రభుత్వమే నిర్మించే అవకాశం ఉందని అన్నారు. అలాగే ‘హాస్పిటాలిటీ’కి నుంచి తీసుకున్న భూమిలో ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించతలిచామని ఆయన తెలియచేశారు. విజయవాడ కృష్ణా తీరం ఉన్న కృష్ణవేణి మొటేల్‌ను ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇచ్చామని అన్నారు. కెనాల్ గెస్ట్‌హౌస్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు దానిని ఆనుకునే ఉన్న స్థలాన్ని కోరుతున్నారని, పంచాయతీరాజ్ కమిషనర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘంలో మంత్రులు నారాయణ, పుల్లారావుతోపాటు, పర్యాటకశాఖ కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.