తెలంగాణ

బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్‌పై వాడీవేడి చర్చ జరిగింది. ఆరు నెలల కోసం ఓటు ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క్ అన్నారు. ఆయన సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని విమర్శించారు. ప్రజలపై రూ.3 లక్షల కోట్ల అప్పు ఉందని, ఇంకా అప్పులు తీసుకువస్తామని చెబుతున్నారని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ రాష్ట్రంపై రూ. 3 లక్షల కోట్ల అప్పు ఉందని నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాగ్ నివేదిక ఆధారంగానే బడ్జెట్‌ను రూపకల్పన చేశామని, వాస్తవాలను ఉన్నది ఉన్నట్లు చెప్పటంతో పాటు వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌కు రూపకల్పన చేశామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై వివరణ ఇస్తూ కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టులు మీకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ ద్వారా 27 చెరువులను నింపామని చెప్పారు. ప్రతిపక్షం పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అని అన్నారు.