ఆంధ్రప్రదేశ్‌

సవాళ్లు, ప్రతిసవాళ్లతో గడిచిపోయన సభాకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 30: శాసనసభా సమావేశాలు ముగిశాయి. ప్రజా సమస్యలను ఏమేరకు చర్చించారన్న అంశాన్ని పక్కనపెడితే, సవాళ్లు, ప్రతి సవాళ్లతోనే సభా కాలం అంతా గడిచిపోయింది. అంతేకాదు, గత శాసనసభా సమావేశాలతో పోల్చి చూస్తే, ఈ సమావేశాల్లో అనేక అసాధారణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమావేశాల్లో రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
* గతంలో ఏ శాసనసభలోనూ ప్రతిపక్ష పార్టీ వరుసగా రెండు రోజులు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టలేదు. ఈ సమావేశాల్లో ఒక రోజు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష వైకాపా ప్రవేశపెట్టింది. అది వీగిపోయింది. మర్నాడే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. తీర్మానం వీగిపోతుందని తెలిసినా, ప్రభుత్వం, స్పీకర్ తీరును బహిర్గతం చేయాలనుకున్న వైకాపా వ్యూహం ఫలించలేదు.
* శాసనసభ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం చాలా అసాధారణమైన విషయం. రోజా విషయంలో ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోవడం విశేషం.
* శాసనసభ సమావేశాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే బిజినెస్ అడ్వైజరి కమిటీ (బిఎసి) సమావేశం అవుతుంది. అటువంటిది ఈ సమావేశాల్లో రెండుసార్లు బిఎసి సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ నెల 24న అసెంబ్లీకి సెలవు ఇచ్చే అంశంపై బిఎసి రెండోసారి సమావేశం కావడం గమనార్హం. అసెంబ్లీ చరిత్రలో ఇది చాలా అరుదైన ఘటనగా పరిశీలకులు చెపుతున్నారు.
* అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన 58 మంది సభ్యులను ఒకేసారి సస్పెండ్ చేసిన ఘటన కూడా ఇక్కడే చోటు చేసుకుంది. సస్పెన్షన్ సమయంలో సభలో లేని వారిని కూడా సస్పెండ్ చేయడం గమనార్హం.
* అన్నింటికన్నా విశేషం ఏంటంటే.. సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి ప్రతిపక్షంలో ఎనిమింది సభ్యులు టిడిపిలో చేరారు. సమావేశాలు ముగిసే సమయానికి మరో ఇద్దరు సభ్యులు వైకాపాకు రాజీనామా చేశారు. విశేషం ఏంటంటే.. సభ జరుగుతున్నప్పుడే, ప్రతిపక్ష పార్టీ ఉప నేత ఆ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పటి వరకూ ఎన్నడూ జరగలేదు.
* అలాగే, కేవలం ఒక సభ్యురాలి కోసం రెండు రోజులపాటు శాసనసభ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శాసనసభ సమావేశాల నుంచి ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తనను తిరిగి సభలోకి రానీయాలంటూ రోజా రోడ్డెక్కడం గమనార్హం.
* శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రివిలేజ్ కమిటీ మూడుసార్లు సమావేశంకావడం గమనార్హం.
ఆక్రమణకు గురైన ప్రభుత్వ
భూముల క్రమబద్ధీకరణ
మార్గదర్శకాలు జారీచేసిన ఎపి ప్రభుత్వం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న 500 గజాల లోపు భూములను క్రమబద్దీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వానికి అభ్యంతరం లేని 500 గజాల లోపు స్ధలంలో ఇళ్లు నిర్మించుకుని ఉన్న వారి స్ధలాలను క్రమబద్దీకరించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. 2014 జనవరి ఒకటి లోపు ఆక్రమించుకున్న వారికి మాత్రమే క్రమబద్దీకరించాలని, ఆర్‌సిసి రూఫ్, ఇటుకలతో నిర్మించిన గోడలు ఉండి, యాజ్‌బెస్టాస్ సిమెంట్ రేకులు కలిగిన ఇళ్లను మాత్రమే క్రమబద్దీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఖాళీ స్ధలాలను గానీ, గుడిసెలను కాని క్రమబద్ధీకరణ పథకంలోకి తీసురావద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1 నుంచి 150 గజాల వరకు 60 శాతం, 151 నుంచి 250 వరకు 75 శాతం, 251 నుంచి 500 వరకు 100 శాతం బేసిక్ మార్కెట్ వాల్యూను వసూలు చేయడం ద్వారా ఈ స్ధలాలను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇప్పటికే భూ ఆక్రమణలను ఎక్కడైనా రెగ్యులరైజ్ చేయించుకుని ఉన్న పేదరికానికి దిగువన ఉన్నవారు, ఎగువన ఉన్నవారు అర్హులు కారని స్పష్టం చేసింది. పేదరికానికి దిగువన ఉండి, 100 గజాల వరకు ఆక్రమణ భూమిని క్రమబద్దీకరించేందుకు ఉత్తర్వులు అమల్లో ఉన్నట్లు తెలిపింది. ఇటువంటి వారు ఈ కొత్త పథకం పరిధిలోకి రారని ప్రభుత్వం స్పష్టం చేసింది. డివిజన్ స్ధాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో సిసిఎల్‌ఏ, ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన కూడిన కమిటీలు ఈ పథకం పరిధిలోకి వచ్చే వారికి ఆమోదం తెలిపే విధంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. బేసిక్ మార్కెట్ వాల్యూను కూడా 2014 జనవరి 1 నుంచి పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

సవరించిన విద్యుత్ టారిఫ్ విధానంపై నేడు ప్రకటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గురువారం కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించనుంది. సవరించిన విద్యుత్ టారిఫ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోని డిస్కాంలు రూ. 783 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఏపిఇఆర్‌సిని కోరిన విషయం విదితమే. మొత్తం లోటు రూ. 5175 కోట్లు ఉండగా, ఇందులో రాష్ట్రప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీని భరిస్తుందో వెల్లడికానుంది. బడ్జెట్‌లో మాత్రం రూ. 3 వేల కోట్ల మేర సబ్సిడీని భరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. సవరించిన టారిఫ్ విధానం వివరాలను ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ వివరిస్తారు. డిస్కాంలు కోరినట్లుగా విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఏపిఇఆర్‌సి అనుమతిస్తుందా లేక తిరస్కరిస్తుందా లేదా కొంత మేరకు చార్జీలను పెంచేందుకు అనుమతిస్తుందా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.