క్రైమ్/లీగల్

సినీ ఫక్కీలో వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం రూరల్, అక్టోబర్ 3: రూరల్ మండల పరిధిలోని కొటిపి రహదారిలోని రైల్వే గేట్ వద్ద మంగళవారం రాత్రి రామాంజినేయులుపై పలుమార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. లేపాక్షికి చెందిన నగేష్, మడకశిర మండలం కోడిపల్లికి చెందిన కిష్టప్ప ఈ దారుణానికి పాల్పడ్డారు. గ్రామస్థులు తెలిపిన మేరకు రైల్వేగేట్ వద్ద అరుపులు వినబడటంతో గేట్‌మెన్ విషయాన్ని ఫోన్ ద్వారా గ్రామస్థులకు తెలిపారు. వెంటనే గ్రామస్థులు హుటాహుటిన రైల్వేగేట్ వద్దకు చేరుకుని పరిశీలించగా కారును తాళ్లతో కట్టివేసిన వ్యక్తిపై ఇటు, అటు నడుపుతుండటాన్ని గమనించారు. భయపడిన స్థానికులు రైల్వేగేట్‌ను వేయించి విషయాన్ని రూరల్ పోలీసులకు సమాచారం అందించి కారును చుట్టుముట్టి నగేష్, కిష్టప్పను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే మృతి చెందిన రామాంజినేయులును కారు డిక్కీలో వేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హతుడు చెనే్నకొత్తపల్లి మండలం దామాజీపల్లికి చెందిన వాడుగా ఎస్సై శేఖర్ తెలిపారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని ఎస్సై తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గర్భవతి ఆత్మహత్య
హిందూపురం రూరల్, అక్టోబర్ 3 : మెట్టినింటి వేధింపులు తాళలేక నిండు గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుది. మండల పరిధిలోని జుమాకులపల్లికి చెందిన సుకన్య (24)కు అదేగ్రామానికి రామాంజితో వివాహమైంది. వివిధ కారణాలతో అత్తింటి వారు సుకన్యను వేధింపులకు గురి చేసేవారు. వేధింపులు అధికం కావడంతో భరించలేక సుకన్య ఇంట్లో పైకప్పునకు ఉరేసుకుని ఆత్మహత్యకు స్థానికులు తెలిపారు. సమాచారం అందగానే రూరల్ ఎస్సై శేఖర్ ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

వ్యక్తి ఆత్మహత్య
హిందూపురం టౌన్, అక్టోబర్ 3 : పట్టణంలోని బెంగళూరు రోడ్డులో నివాసం ఉంటున్న వెలుగోటి రామాంజినేయులు (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామాంజినేయులుకు కొనే్నళ్ల క్రితం వివాహం కాగా మనస్పర్థల కారణంగా భార్య వేరుగా నివాసం ఉంటోంది. పలుమార్లు కాపురానికి పిలిచినా ఆమె నిరాకరించడంతో రామాంజినేయులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉంటూ జీవితంపై విరక్తి చెందిన దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.