క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, అక్టోబర్ 6 : మండల పరిధిలోని కల్లూరు గ్రామ సమీపంలో ఓ వ్యక్తి శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కురుబ దాసన్న (50) మధ్యాహ్నం తన పొలంలో వేసిన మొక్కజొన్న పంటను పరిశీలించేందుకు మధ్యాహ్నం వెళ్లాడు. ఆ సమయంలో పొలంలో గట్టులో పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా ముళ్ల కంచె తీగలను పట్టుకున్నాడు. ఆ తీగల్లో విద్యుత్ ప్రసరించడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై ప్రమాద స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు ముళ్లకంచెకు విద్యుత్ సరఫరా ఏ విధంగా జరిగిందో పరిశీలించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మమ్మతోపాటు ముగ్గరు సంతానం ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వ్యక్తి మృతి
పుట్లూరు, అక్టోబర్ 6 : పుట్లూరు మండలంలోని ఎస్. గూడూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం తిరుపాల్‌రెడ్డి (37) అనే రైతు అప్పుల బాధ తాళ లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. తిరుపాల్‌రెడ్డిని చికిత్స కొరకు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం వెళ్ళాల్సిందిగా వైద్యులు తెలపడంతో తీసుకువెళ్తున్న సమయంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.