క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమందేపల్లి, నవంబర్ 11 : మండల పరిధిలోని చాకర్లపల్లిలో ఆదివారం విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ అశోక్ (22) మృతి చెందాడు. స్థానికలు, బంధువులు తెలిపిన వివరాల మేరకు రొద్దం మండలం కోగిరకు చెందిన రామాంజినేయులు కుమారుడు అశోక్ సోమందేపల్లి మండలం ఈదులబళ్లాపురంలోని బంధువుల ఇంటికి వచ్చి వాటర్‌షెడ్ ద్వారా మంజూరైన ఇంకుడు గుంత పనులు చేస్తున్నాడు. ఇందులో భాగంగా రైతు దామోదర్‌రెడ్డి పొలంలో పనులు చేస్తుండగా మట్టిని తరలిస్తున్నాడు. ఈనేపథ్యంలో విద్యుత్ స్తంభానికి ఉన్న స్టే వైర్ తెగిపోవడంతో విద్యుత్ స్తంభం ఒక్కసారిగా ట్రాక్టర్ ట్రాలీపై పడింది. ట్రాక్టర్ మొత్తం విద్యుత్ సరఫరా జరగడంతో గమనించిన డ్రైవర్ అశోక్ కిందకు దూకి తీవ్రగాయాలకు గురయ్యాడు. వెంటనే అతన్ని సోమందేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న భార్య, తల్లిదండ్రులు బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య
హిందూపురం టౌన్, నవంబర్ 11 : మున్సిపల్ పరిధిలోని మోడల్‌కాలనీకి చెందిన తబస్సుం (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి వివరాలు ఉన్నాయి. ఏడేళ్ల క్రితం తబస్సుమ్‌కు మోడల్‌కాలనీకి చెందిన మునీర్ హమీద్‌తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భార్యాభర్తలు ఇద్దరూ అప్పులు చేశారు. అప్పుల తీర్చేమార్గం లేకపోవడంతో తబస్సుం ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్టు
ధర్మవరం, నవంబర్ 11: ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన శశికళపై జరిగిన హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ వెంకటరమణ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగలూరు గ్రామానికి చెందిన శశికళ తన దగ్గరి బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో ఆమె భర్త ఒకటిన్నర నెల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే ఆమె బావలు, వారి కొడుకులు ఆమెపై కక్ష పెంచుకొని ఆమెను చంపాలని మాట్లాడుకొని ఈ నెల 9న కొత్తచెరువు నుండి శశికళ తన తమ్ముడితో కలసి మోటార్‌సైకిల్‌పై వస్తున్న సమయంలో ఆమెపై యశోద పాఠశాల వద్ద రాత్రి సమయంలో గంతిమర్రి సురేంద్ర వారి వాహనంపై రాళ్లు విసిరాడు. బైక్‌లో కిందకు పడిపోగానే వారి బైక్‌ను వెంబడించి వెనుక వైపు వస్తున్న వారాదప్ప సూరి కత్తితో బాధితురాలు వీపు, మెడపైన కోసి చంపడానికి ప్రయత్నించారు. అనంతరం అక్కడి నుంచి సంఘటనలో పాల్గొన్న అమరనాథ్, చిన్నపోతులయ్య, ఆనంద్‌తోపాటు సురేంద్ర, వారాదప్ప పారిపోయారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని పట్టణ సీఐ అస్రార్‌బాషా, ఎస్‌ఐ శ్రీహర్ష విచారణ చేపట్టగా విషయాలు బయటపడ్డాయన్నారు. అయితే నిందితులు బెంగళూరుకు పారిపోతున్నట్లు సమాచారం అందుకున్న సీఐ, ఎస్‌ఐలు మార్కెట్ యార్డు వద్ద వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సూరికత్తి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. 24 గంటల లోపే సంఘటనలో పాల్గొన్న నిందితులను అరెస్టు చేసిన సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి
బొమ్మనహాల్, నవంబర్ 11 : మండల పరిధిలోని ఉంతకల్లు క్రాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి చెందాడు. జమేదార్ పుట్టప్ప తెలిపిన వివరాల మేరకు కర్నాటకకు చెందిన టిప్పర్ ఉద్దేహాల్ గ్రామంలోని ఓ పెట్రోల్ బంకులో డ్రైవర్ తిమ్మారెడ్డి, క్లీనర్ ప్రశాంత్ డీజిల్‌ను వేయించుకుని తిరిగి కణేకల్లు-బళ్లారి రహదారి వెంట బొమ్మనహాల్‌కు బయలుదేరారు. అయితే ఉంతకల్లు క్రాస్ వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లినర్ ప్రశాంత్ (30) అక్కడిక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తిమ్మారెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. తిమ్మారెడ్డిని వైద్య చికిత్స నిమిత్తం బళ్లారికి తరలించి శవాన్ని పోస్టుమార్టం తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.