క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూన్ 14 : పట్టణంలోని బీసీ కాలనీలో గురువారం విద్యుదాఘాతంతో సాయిప్రసాద్ మృతి చెందాడు. సాయిప్రసాద్ ప్రైవేట్ హెల్పర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బీసీ కాలనీలో ఓ ఇంటికి విద్యుత్ వైర్లు మారుస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే స్థానికులు ప్రైవేట్ నర్సింగ్‌హోంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి
సోమందేపల్లి, జూన్ 14 : మండల పరిధిలోని వెలిదడకల సమీపంలో గురువారం కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో హిందూపురానికి చెందిన వైద్యుడు విశ్వనాథ్ (38) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విశ్వనాథ్ పొద్దుటూరు నుంచి కారులో డ్రైవర్ ముజుమీల్‌తో కలిసి తన భార్యను పుట్టిళ్లు హిందూపురంలో వదిలేందుకు వస్తుండగా పాలసముద్రం సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎఎస్సై తిరుపాల్‌నాయక్ ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గార్లదినె్న, జూన్ 14 : మండల కేంద్రంలోని అక్షర స్కూల్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హసేన్ (23) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మర్నాడు గ్రామానికి చెందిన హసేన్ ఐచర్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇందులో భాగంగానే తిమ్మంపేట వైపు నుంచి గార్లదినె్నకు ద్విచక్రవాహనంలో వస్తుండగా అక్షర స్కూల్ సమీపం వద్దకు రాగానే అనంతపురం నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో హసేన్ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాంప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి తల్లిదండ్రులతోపాటు భార్య ఖాసీంబీ ఉన్నారు.

రైతు అనుమానాస్పద మృతి
ధర్మవరం, జూన్ 14 : పట్టణంలోని శివానగర్‌లోని శివాలయం వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మృతుడు తుమ్మల గ్రామానికి చెందిన రాజమ్మోహన్‌గౌడ్‌గా గుర్తించారు. ఇతను వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. అయితే వ్యవసాయంలో పంటలు పండకపోవడంతో దిక్కుతోచక చివరికి మూడేళ్ల క్రితమే అనంతపురంకు వెలస వెళ్ళి హోటల్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే అప్పుడప్పుడు ధర్మవరంలో వున్న తమ్ముళ్ల ఇంటికి వచ్చేవారు. ఈ నేపథ్యంలో అనంతపురం నుండి బుధవారం ధర్మవరంకు వచ్చాడని, అయితే గురువారం ఉదయం రాజమ్మోహన్‌గౌడ్ శవమై కనిపించాడని స్థానికులు పేర్కొంటున్నారు. శవం వద్ద మద్యం బాటిళ్లు ఉన్నాయని, ఆయన ఎక్కువగా మద్యం సేవించేవాడని స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానికులు తమ్ముళ్లకు సమాచారం అదించారు. వారు అనంతపురంలోని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు ధర్మవరం వచ్చి రాజమ్మోహన్‌గౌడ్ మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.