అవీ .. ఇవీ..

నీ పాదాల చెంత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వాసానికి శునకాలు మారుపేరుగా చెప్పుకుంటాం. ఆఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాల తరపున జరిపిన పోరాటంలో పాల్గొని రెండు కాళ్లూ కోల్పోయిన అమెరికాకు చెందిన మాజీ సైనికుడు నాక్స్ విల్లే ఇలా విశ్రాంతి తీసుకుంటూంటే అతడివద్ద శిక్షణ పొందిన సైనిక శునకం ఇలా విధేయత చాటుకుంది. ఆఫ్గానిస్తాన్‌లో 2012లో విధులు నిర్వహిస్తుండగా తాలిబన్ల దాటిలో విల్లే కాళ్లు కోల్పోయాడు. ఈమధ్య అమెరికాలో జరిపిన మాజీ సైనికులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న విల్లే కొద్దిసేపు ఇలా విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ సైనిక శునకం ఇలా అతడి కాళ్లవద్ద సేదదీరింది.

బొమ్మ చెరిపినందుకు బహుమతి
ఈ గోడమీద బొమ్మ వేసింది ప్రఖ్యాత మ్యురల్ ఆర్టిస్ట్ స్కాట్ మాష్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ శివారులో ఆయన ఈ బొమ్మను వేశారు.ఆ బొమ్మకు ‘కనెవెస్ట్ కిస్సింగ్ కనెవెస్ట్’ అన్న ట్యాగ్‌లైన్ రాశారు. ఈ చిత్రం సోషల్‌మీడియాలో పెద్ద ఆకర్షణైపోయింది. అయితే బొమ్మ వేసినందుకు పేరైతే వచ్చిందికానీ...పెద్దగా లాభం లేకపోయింది. కానీ ఆ బొమ్మను చెరిపేసేందుకు లక్షల డాలర్లు ఇస్తామంటూ ఓ పేద్ద ఆఫర్ రావడంతో మాష్...ఎగిరి గంతేశాడు. డబ్బు అందుకున్నాక అంత అందమైన బొమ్మనీ చెరిపేశాడు. పాశ్చాత్య ప్రపంచంలో ఇదే పెద్ద సంచలనమైపోయింది.

షార్క్‌లతో సరదాగా...
నీటి అడుగున్న ఉన్న ఓ అద్దాల గదిలో హాయిగా గడుపుతూ బయట స్వేచ్ఛగా తిరుగుతన్న షార్క్ చేపలను దగ్గరినుంచి చూసే ధైర్యం మీకుందా..ఉంటే రండి అని పిలుస్తోంది పారిస్‌లోని ఓ సంస్థ. తన హోటల్‌లోని ఓ భారీ అక్వేరియంలో ఏర్పాటు చేసిన గ్లాస్ ఛాంబర్‌లో పడుకునేందుకు, సేద దీరేందుకు చక్కటి ఏర్పాట్లు చేసింది. మన గాజుగది చుట్టూ 35 ప్రమాదకరమైన షార్క్‌లు తిరుగుతూంటాయి. ధైర్యంగా ఓ 24 గంటలు అక్కడ గడిపితే చాలు బహుమతులు ఇస్తుంది. పారిస్‌లోని డి పారిస్ అక్వేరియం సంస్థ ఈ ఆఫర్ చేసింది. మీరు గదిలో ఉండి షార్క్‌లను చూస్తూండే ప్రపంచ ప్రఖ్యాత డైవర్ బయట వాటితోపాటు తిరుగుతూ ఆ చేపల ప్రత్యేకతలు వివరిస్తాడట తెలుసా. బాగుందికదూ..ఆఫర్.

పిల్లో ఫైట్

ఈ రోజుల్లో ఆటకు..ఆనందానికి ఓ సాకు దొరకాలంతే...కుర్రకారుకు ఇక హద్దులుండవ్. ఇదిగో ఈమధ్య జరిగిన పిల్లో ఫైట్ వేడుకలో దేశవిదేశాల్లో యువత పాలుపంచుకుంది. హాంకాంగ్‌లో జరిగిన వేడుకల్లో తలమునకలైన యువతీయువకుల పట్టపగ్గాల్లేని ఆనందానికి ఈ ఫోటోలు అద్దంపడుతున్నాయి.

శాంతికోసం...

డెమోక్రటిక్ రిపిబ్లిక్ ఆఫ్ కాంగో పేరు అందరికీ తెలిసిందే. అరాచకం, అస్థిరత, నరమేథం, ఆర్థిక సమస్యలు, తిరుగుబాట్లతో అతలాకుతలవౌతున్న కాంగోలో శాంతి, సుస్థిరతల సాధనకోసం ఐక్యరాజ్య సమితి శ్రమిస్తోంది. యునైటెడ్ నేషన్స్ స్టెబిలైజేషన్ మిషన్‌లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఉరుగ్వే సైనికుడు ఓ శిబిరంవద్ద ఇలా పహరాకాస్తున్నాడు. ఈ తటస్థ సైనిక శిబిరాలవద్ద కన్పించే చిత్రాలు, పోస్టర్లు అక్కడి పరిస్థితికి అద్దంపడుతున్నాయి.