అవీ .. ఇవీ..

అపూర్వ వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ఐదురోజుల పాటు దాదాపు లక్షన్నర మంది ఒకేచోట నివసించి తమకు నచ్చిన రీతిలో, సంప్రదాయంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే వేడుక గ్లాస్టన్‌బ్యురో ఫెస్టివల్. ఇంగ్లండ్‌లోని పిల్టన్‌లో ఏటా దీనిని నిర్వహిస్తారు. 1970 నుంచి ఇది ఓ సంప్రదాయంగా మారిపోయింది. మొదట హిప్పీలు, అలాంటి తరహా జీవనవిధానంలో ఉన్నవారు ఇలా ఒకచోటికి చేరి వేడుక చేసుకునేవారు. రానురాను ఇది విస్తృత ప్రజాదరణ పొంది జనసామాన్యానికి చేరువైంది. స్వేచ్ఛ, కళ, సంస్కృతి, ఆచారసంప్రదాయాలు, గిరిజన తెగలకు చెందినవారికి భాగస్వామ్యంతో దీనికి కొత్తకళ వచ్చింది. ఆటలు, పాటలు, సంగీతం, సినిమాలు, ఒకటేమిటి ఎవరికి వచ్చినట్లు వారు ఇక్కడ పాల్గొనవచ్చు. ఈ ఏడాది ఈ వేడుకకు 1.5 లక్షలమందికి పైగానే హాజరవుతారని అంచనా. వారికి విడిది కోసం ఇదిగో ఇలా గుడారాలు ఏర్పాటు చేశారన్నమాట. గతేడాది ఈ వేడుకకు 1.35 లక్షలమంది వచ్చారని అంచనా.

- భారతి