అవీ .. ఇవీ..

బుద్ధం శరణం గచ్ఛామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్‌లోని జోగ్యే బౌద్ధారామంలో ఇప్పుడు ముద్దులొలికే చిన్నారులు గుండుతో దర్శనమిస్తున్నారు. ఏటా అక్కడ నిర్వహించే ‘బౌద్ధ భిక్షువుల్లా చిన్నారులు’ వేడుక నిర్వహిస్తారు. మే 11న ప్రారంభమైన ఈ ఉత్సవం 25వ తేదీ వరకు నిర్వహిస్తారు. బౌద్ధంపై ఆసక్తి ఉన్నవారి పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చి వారికి గుండు చేయించి, మెడలో తులసిమాలలు వేసి బౌద్ధమతం గురించి బోధనలు చేస్తారు. బౌద్ధ భిక్షువుల్లా వారు ఈ రెండువారాలూ శిక్షణ పొందుతారు. ఇక ఈ వేడుకకు వచ్చే చిన్నారులకు క్షౌరం చేస్తున్నప్పుడు ఏడుపులుపెడబొబ్బలూ సాధారణమే. ఒకటిరెండు రోజుల్లో వారిలో స్పష్టమైన మార్పు కన్పిస్తుంది.

తల్లీపిల్ల...
ఒకటిగా

జన్యుపర లోపంతో పుట్టిన పక్షి కాదు సుమా ఇది. మసాచుసెట్స్ సముద్రతీరంలో పైపింగ్ ప్లోవర్ తల్లీపిల్ల పక్షులు కలసి తిరుగుతున్నప్పుడు నిపుణుడైన ఓ ఫోటోగ్రాఫర్ తీసిన చిత్రరాజం ఇది. ఆ రెండు పక్షులూ కలసిపోయినట్లు, రెండు తలల పక్షిలాగా భ్రమింపచేస్తున్నట్లు ఈ చిత్రం ఉందికదా. ఎప్పటిమాదిరిగానే ఈ ఏడుకూడా నేషనల్ అడుబొన్ సొసైటీ నిర్వహించిన ఉత్తమ ఛాయాచిత్రాల పోటీలో ఈ ఫోటోకు ఉత్తమ బహుమతి వచ్చింది. 1700మంది ఫొటోగ్రాఫర్లు దాదాపు 7వేల ఫోటోలను ఈ పోటీకి పంపిస్తే, ప్రొఫెషనల్ కేటగిరీలో మార్టిన్ వి స్నేరీ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రం గ్రాండ్ ప్రైజ్ విన్నర్‌గా నిలిచింది. ఈ ఫోటో చూస్తే..ఆ బహుమతి అర్హమైనదేనని మనమూ చెబుతాం కదా.

గాజుఫలకం నుంచి సైట్‌సీయింగ్

ఎతె్తైన పర్వతశిఖరం అంచున, గాలిలో వేళ్లాడుతూండేలా గాజుతో కట్టిన అతి పెద్దదైన సైట్‌సీయింగ్ ప్రాంతం ఇది. దీని పేరు షిలింక్షియా. చైనాలోని పిగ్గూ ప్రాంతంలో దీనిని నిర్మించారు. 32.8 మీటర్ల వ్యాసంలో, 415 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని అర్ధగోళాకారంలో నిర్మించారు. ఈ ఫొటోలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తూంటే ఏ మాత్రం భయం లేకుండా సందర్శకులు మాత్రం ఈ గాజునిర్మాణంపై అడుగులేస్తు ఆనందిస్తున్నారు. కిందికి చూస్తే లోతైన లోయ, పైకి చూస్తే ఏ ఆధారం లేని వాతావరణం...కాస్తంత గుండె ధైర్యం ఉంటే మాత్రం అదొక అద్భుత కాలక్షేపం. ఇది ఈమధ్యే అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద గ్లాస్ సైట్‌సీయింగ్ ప్లేస్‌గా భావిస్తున్నారు.

పేద్ద బబుల్...

ముంచెత్తిన డ్రింక్
ఇక్కడ కన్పిస్తున్న ఇద్దరూ ఆటగాళ్లు. ఈ మధ్య టొరంటోలో నిర్వహించిన ఓ ఆటలపోటీలో ఈ దృశ్యాలు కన్పించాయి. టెక్సాస్ రేంజర్స్, బ్లూ జేస్ జట్ల మధ్య ఈ పోటీ జరిగింది. ఆట మధ్యలో తీరిక దొరికినప్పుడు హాన్సర్ అల్బెర్టొ అనే క్రీడాకారుడు చూయింగ్‌గమ్‌తో చేసిన అతిపెద్ద బబుల్ పగిలి ఇలా ఆయన ముఖాన్ని చుట్టేసింది. ఇక రస్సెల్ మార్టిన్ అనే మరో క్రీడాకారుడిపై అభిమానంతో ఆ జట్టు సభ్యులు గటోరడే అనే స్పోర్ట్స్ డ్రింక్‌ను అతడిపై గుమ్మరించారు. ఆనందం పట్టపగ్గాల్లేనప్పుడు, లేదా అద్భుతమైన ప్రతిభ చూపినప్పుడు ఇలా చేయడం ఓ సంప్రదాయం. 1979 ప్రాంతంలో వచ్చిన ఈ సంప్రదాయాన్ని గటోరడే పోర్ అని వ్యవహరిస్తారు. ఇంతకీ గటోరడే అనేది సోర్ట్స్ డ్రింక్‌లలో ఓ ప్రముఖ బ్రాండ్.

భారతి