మెయిన్ ఫీచర్

అవనికి వెలుగు అతివ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్ల అంటే ఆనందవార్థి. ఆడపిల్లలున్న అభ్యుదయం అని పొంగిపోయాడు ఆచార్య కసిరెడ్డి. ఆడపిల్ల లేని ఇంటికి కళే ఉండదంటారు పెద్దలు. నిజమే! స్ర్తి లేకుంటే ఈ సృష్టికి సొగసే లేదు. అందుకే ‘మగువేగా మగవాడికి మధుర భావన’ అన్నారు దాశరథి!

ఈడొచ్చిన ఆడపిల్లను ఓ అయ్య చేతిలో పెట్టి నాన్నలు పసిపిల్లల్లా ఏడుస్తారు! మగవాని బతుకులో సగపాలు తనదిగా.. జీవితం.. అంకితం చేసినా కూడా ఆమె త్యాగాన్ని ఎవరు గుర్తించడంలేదు. కొడుకు పుడితే కోలాహలం చేసి, కూతురు పుడితే కుంగుబాటుకు లోనయ్యే సంస్కృతి ఇప్పటికీ ఉండటం బాధాకరం. ప్రపంచ వ్యాప్తంగా సుమారు కోటి 20 లక్షలమందిలో పది లక్షల మంది తొలి పుట్టిన రోజు వరకు కూడా బతకడం లేదనేది ఓ సర్వే చెప్తున్నది. పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డే అని తెలుసుకుని కడుపులోనే చంపేసేవాళ్ళు అనేకమంది కన్పిస్తుంటారు. సాంకేతిక విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినా ఆడపిల్లల్ని బతికించడంలో మానవ ప్రయత్నం నానాటికీ ఎందుకు తగ్గుతున్నదీ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అమ్మ స్వరూపం అయిన స్ర్తిమూర్తికి ఈ అవనిపై పుట్టినప్పటినుండి ఎన్నో కష్టాలు.. తానూ ఓ స్ర్తియే అని ఆలోచించక తమ పిల్లలను ఎన్నో కష్టాల పాలు చేస్తున్నారు. కొందరు పుట్టిన శిశువు ఆడపిల్ల అని తెలిసాక ఎక్కడో వదిలి వేస్తున్నారు. చదువు విషయంలో కొడుకుకు ఇస్తున్న ప్రాధాన్యత కూతుళ్ళకు ఇవ్వడంలేదు. కొడుకులే వారసులు అనే సంప్రదాయం ఉన్న మన దేశంలో కూడా తల్లిదండ్రులను పోషిస్తున్న కూతుళ్ళ సంఖ్య ఈమధ్యకాలంలో బాగా పెరుగుతోంది.
ఆడపిల్ల పుట్టిందా? సమాజంలో అవమానంగా భావించే ఈ రోజుల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుట్టిందని తెలియడంతో బాలికోత్సవం జరుపుకునే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. రాజస్థాన్‌లోని రాజ్యమండ్ జిల్లాలో పిప్లాంత్రి అనే గ్రామంలో ఆడపిల్ల పుట్టిందంటే గ్రామంలో ప్రజలంతా సంతోషంగా అడవికి వెళ్లి అమ్మాయి పేరుమీద 111మొక్కలు నాటుతారట.
కేవలం నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకుంటారు. అంతేకాదు, పుట్టిన ప్రతి అమ్మాయికీ ఆర్థిక భద్రతను కలిగించేందుకు తమ వాటాకా రూ.21000 ఇస్తారు. అమ్మాయి తండ్రి వాటాగా 10వేలు మొత్తం ఇస్తారు. ఈ నగదునంతా కలిపి అమ్మాయి పేరుమీద 20 సంవత్సరాలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఆ అమ్మాయికి యుక్త వయస్సు వచ్చేవరకు పెండ్లిచేయమనీ, ఎంతవరకు చదువితే అంతవరకు చదివిస్తామని తల్లిదండ్రులతో ప్రమాణం చేయిస్తారు. ఇలా ఇంతవరకు దాదాపు గ్రామస్థులు 2 లక్షల 50 వేల మొక్కలు నాటారట. అదేవిధంగా మహారాష్టల్రోని ఒక వ్యక్తి ఎవరికైనా ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో ఉండే మగవారికి ఆరునెలలపాటు ఉచితంగా కటింగ్- షేవింగ్ చేస్తానని ప్రకటించాడట. లింగవివక్షను అరికట్టేందుకు ఈ చర్యలు హర్షణీయమే. ఒక కుమార్తె పది కుమారులతో సమానమని ఉద్బోధించారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒక కార్యక్రమంలో.
కంటే కూతుర్నే కనాలి
జాతీయ కుటుంబ సర్వే ప్రకారం దేశంలోని 79 శాతం మహిళలు (15-49 ఏళ్లవారు) 78 శాతం పురుషులు (15-54వయసువారు) కనీసం ఒక్క ఆడపిల్ల అయినా కావాలని అనుకుంటున్నారు. ఇది విద్యావంతుల్లో వచ్చినమార్పు కాదు. ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, గ్రామీణలు ఇలా అనేక వర్గాలకు చెందినవారిలో కన్పించిన మార్పు అని సర్వే వెల్లడించింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 2005-06లో నిర్వహించిన సర్వేలో 74 శాతం మహిళలు 65 శాతం పురుషులు తమకు ఆడపిల్ల కావాలని కోరగా, తాజాగా వారి సంఖ్య పెరగడం విశేషం.
నగరంలోని 75 శాతం మహిళలు ఆడపిల్ల కావాలని కోరుకుంటుంటే, గ్రామాల్లో 81 శాతం మహిళలు తమ ఇంట్లో ఒక మహిళ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నారు. కనీసం ఇంటర్‌వరకూ చదువుకున్న మహిళల్లో 72 శాతంమంది ఆడపిల్ల కావాలని కోరుకుంటే, నిరక్షరాస్యుల్లో 85 శాతంమంది ఆడశిశువుకోసం పరిపిస్తుండటం విశేషం. అలాగే పదేళ్ళ నాటి సర్వేతో పోల్చితే బాలికల్లో చదువుకుంటున్న వారి శాతం 55.1 శాతం నుంచి 68.4 శాతానికి పెరిగింది. సర్వేలో సుమారు 5,68,200 కుటుంబాలను సర్వేచేశారు. 8 లక్షలమంది మహిళలతో మాట్లాడారు. అందుకే ఆడపిల్లలున్న ప్రతి కుటుంబానికి ప్రోత్సాహకరం ఇవ్వడం ద్వారా పరిస్థితులలో మార్పులు సాధించవచ్చు. విద్యారంగంలో బాలికలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. ఓ అధ్యయనం ప్రకారం ఎనిమిదవ తరగతి బాలికల డ్రాపౌట్స్ శాతం ఏపిలో 3.78 శాతం, తెలంగాణలో 5.31 శాతం ఉంది. 9వ తరగతి బాలికలు ఏపిలో 2.89 శాతం, తెలంగాణలో 4.70 శాతం చదువులు ఆపేస్తున్నారు. ఇంటర్‌లో బాలికలు ఏపిలో 11.79 శాం, తెలంగాణాలో 13.22 శాతం మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రధాని మోది ఇటీవల దేశ ప్రజలకు పిలుపునివ్వడం హర్షించదగిన విషయం. బాలికల సంరక్షణ, సమాన అవకాశాల కల్పన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అంటూ ఢిల్లీలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. 2008 నుంచి ఏటా జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని దేశంలో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఏటా కోటికిపైగా ఆడశిశవుల భ్రూణహత్యలు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మోది హయంలో ‘్భటీ బచావ్, బేటి పడావ్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాలికల చదువుల కోసం కస్టూర్బా గాంధీ విద్యాలయాలు, ప్రత్యేక పాఠశాలలు, ఆవాస పాఠశాలలు తమ వంతు ప్రయత్నాలతో ప్రత్యేక ముద్రను చాటుకున్నాయి. అయినా కొన్నిచోట్ల ఆడపిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో, ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమో ఆడపిల్లలలను చదువుకు దూరం చేస్తున్నారు. ఒకవేళ బడికి పంపించినా మధ్యలోనే మాన్పించేస్తున్నారు.
ఈరోజుకీ అమ్మాయి పుట్టగానే ఆమెకి ఎలా పెళ్లిచేయాలి అని దిగులు పడే తల్లిదండ్రులు మన దేశంలో ఉన్నారు. ప్రపంచంలోనే బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా 15-18 సంవత్సరాలమధ్య వయస్సులో ఎక్కువమంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రుల దృక్పథంలో మార్పువస్తే తప్ప బాల్యవివాహాలు ఆగవు.
ముందుకు సాగాలి
సంప్రదాయల పేరిట ఆంక్షలు భారతీయ మహిళల వికాసాన్ని నిరోధిస్తున్నాయని తాజా అంతర్జాతీయ సర్వేలో తేలింది. పేదరికం, విద్య, ఆరోగ్యం, భద్రత అంశాల్లో బాలికలు, మహిళలు విచక్షణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘ప్లాన్ ఇండియా’ నిర్వహించిన విస్తృత అధ్యయనంలో తేటతెల్లమైంది. శాస్త్ర, సాంకేతిక విద్యా సంస్థల్లో నేటికీ యువతుల సంఖ్య తక్కువగా ఉండడంపై ఇటీవల రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ ఆందోళన వ్యక్తపరిచారు. తల్లిస్వరూపమైన బాలికలను కాపాడుకోవడం సమాజంలోని అందరి బాధ్యత. వారిపై వివక్షను విడనాడాలి. అన్ని రంగాల్లోనూ ముందడుగు వేసేలా ప్రోత్సాహం ఇవ్వాలి. మన దేశంలో ఆడపిల్లలు పుట్టిన వెంటనే ప్రోత్సాహమందించే గ్రామీణ ప్రాంతాలను ఆదర్శంగా తీసుకోవాలి. అందులో ‘ఆడపిల్లను రక్షించుకుందాం’ అనే పేరుతో రాజస్థాన్‌లోని సికార్ జిల్లా మెట్లపాస్‌లో పురుడుపోసుకున్నది. అక్కడ ఆడపిల్ల పుడితే ఏకంగా పండగ చేసుకునేంత పరిణతి పొంది ఉన్నారు. వాళ్ళు అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లను చదివిస్తారు. ఆడపిల్లల ఆవశ్యత గురించి అవగాహన కల్పించి ఆడపిల్లల్ని కన్నవారికి అభినందనలు తెలియచేయడం ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఉద్యమకర్త మంజుదేవి. ఆడపిల్లలను ‘ఆడ పిల్ల’ అనే చులకనభావనతో చూడటంవల్ల తను, అమ్మాయినీ ఏమీ చేయలేననే భావన వారిలో ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తేలింది. అందుకే మార్పు అనేది ఇంటినుండే రావాలి. అందుకే ఆడపిల్ల చదువు- అవనికి వెలుగు అని చాటుదాం.

-కె.రామ్మోహన్‌రావు