బిజినెస్

పీఎన్బీలో భారీ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 11వేల కోట్లకు పైగా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు కనుగొన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబయిలోని ఒక బ్రాంచ్ పీఎన్‌బీని మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న లగ్జరీ డైమండ్ జ్యుయెలరి బ్రాండ్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ నీరవ్ మోదీ. 2017 నవంబర్ 8న ఢిల్లీలో బ్రిటన్ యువరాజు చార్లెస్‌తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పటి చిత్రమిది.

న్యూఢిల్లీ- ఫిబ్రవరి 14: దేశంలోని బ్యాంకింగ్ రంగంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో పెద్ద కుంభకోణం వెలుగు చూసింది. ముంబయిలోని ఒక శాఖలో దాదాపు 11,400 (1.77 బిలియన్ డాలర్లు) కోట్ల రూపాయల మేరకు లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు పీఎన్‌బీ ప్రకటించింది. ఈ మేరకు క్రైమ్‌బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సీబీఐ)కి ఫిర్యాదు చేసింది. కాగా గడచిన పదిరోజుల్లో ఆ బ్యాంకులో వెలుగుచూసిన రెండవ కుంభకోణం ఇది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అక్రమ లావాదేవీల ద్వారా మోసానికి పాల్పడ్డారని గుర్తించిన పీఎన్‌బీ వారం క్రితం సీబీఐని ఆశ్రయించింది. కాగా తాజా కుంభకోణంలోనూ నీరవ్ మోదీ పాత్ర ఉందంటూ మరో ఫిర్యాదు చేసింది. ఈ అవినీతి వ్యవహారాలు ఆర్థికరంగాన్ని కుదిపేశాయి. ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్‌లో ఆ బ్యాంకు షేర్లు పతనమైనాయి. కుంభకోణం వెలుగుచూసిన బుధవారం నాడు పీఎన్‌బీ షేర్లు 6 శాతం మేరకు కుప్పకూలాయి. మరోవైపు ఈ లావాదేవీలతో సంబంధం ఉన్న మరికొన్ని బ్యాంకులు ఈ వారాంతంలోగా నివేదికలు సమర్పించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశించింది. విదేశాల్లో ఉన్నవారికి ముంబైలోని ఒక శాఖలోని కొన్ని ఖాతాల ద్వారా అక్రమంగా భారీ మొత్తంలో నగదు మళ్లించిన విషయాన్ని పీఎన్‌బీ అధికారులు గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. కొన్ని బ్యాంకులు ఇచ్చిన హామీపత్రాల ఆధారంగా విదేశాల్లోని ఖాతాలకు భారీగా రుణాల మంజూరు, చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ బ్యాంకులన్నీ వివాదంలో చిక్కుకున్నట్టయింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతడి అనుయాయులు, సంస్థలకు పీఎన్‌బీ అక్రమంగా ఇచ్చిన లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ ద్వారా మోసానికి పాల్పడి విదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా నగదు వసూలు చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. 2011 నుంచి డిప్యూటీ జనరల్ స్థాయి అధికారితోసహా పలువురు సిబ్బందితో కుమ్మక్కయి ఈ అక్రమ, అనధికారిక లావాదేవీలు నిర్వహించారని ఉన్నతాధికారులు గుర్తించారు. కాగా ఈ అవినీతి బాగోతంతో సంబంధం ఉన్న పదిమంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మరోవైపు తాజా కుంభకోణంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బ్యాంకులు ఈ వారాంతానికి నివేదికలు సమర్పించాలని, అవినీతికి పాల్పడిన సొంత సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో మెతకగా వ్యవహరించవద్దని ఆదేశించింది. కాగా మంగళవారం రాత్రి రోజువారీ లావాదేవీల పరిశీలిస్తున్న సందర్భంలో పీఎన్‌బీ అధికారులు ఈ కుంభకోణాన్ని గుర్తించారు. కాగా బుధవారం నాడు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ అధికారులు మాట్లాడుతూ అవినీతి, అక్రమ లావాదేవీలపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి ఏ చర్యలు చేపట్టాలన్నది అతి త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. కాగా ప్రపంచస్థాయి సెలబ్రిటీలకు చిరపరిచితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఒక బ్రాంచ్‌లో 280 కోట్ల రూపాయల మేరకు అక్రమ లావాదేవీలు నిర్వహించారని సీబీఐకు గత వారం ఫిర్యాదు చేసింది. ఇప్పటి కుంభకోణం రెండోది. కాగా తాజా పరిణామాలపై బాంబే స్టాక్ ఎక్స్ఛేంజికి పీఎన్‌బీ సమాచారమిచ్చింది. లాగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. బెల్జియంలో పుట్టిపెరిగిన నీరవ్‌మోదీ 3గీతాంజలి2 పేరుతో వజ్రాల ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. అంతర్జాతీయంగా పేరుప్రతిష్ఠలున్న బ్రాండ్‌గా తన పేరుతోనే ఆభరణాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. మోసం, ఫోర్జరీలకు పాల్పడి 280 కోట్ల మేరకు కొల్లగొట్టారని నీరవ్‌మోదీ, అతడి భాగస్వామి మెహుల్ ఛోస్కీలపై గత వారం పీఎన్‌బీ సీబీఐకు ఫిర్యాదు చేసింది.