రాష్ట్రీయం

బోగస్ ఎస్సీల భరతం పట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రైస్తవ మతం ముసుగులో ఎస్సీలుగా చలామణి అవుతున్న వారిని గుర్తించాలని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. హెచ్‌సియులో విద్యార్థి రోహిత్ మరణం బాధాకరమని, విద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు సోపానాలు కావాలి గానీ మరణకేంద్రాలు కాకూడదని సమితి జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం, జాతీయ ఉపాధ్యక్షుడు పాలడుగు అనిల్‌కుమార్, రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ దేవేంద్రప్ప అన్నారు.
శనివారం ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థి రోహిత్ కులంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పష్టత ఇస్తూ ప్రకటన జారీ చేయాలని, తమ రాష్ట్రాల్లో ఉన్న బోగస్ ఎస్సీ సర్ట్ఫికెట్ల జారీపై సిబిఐతో విచారణ చేయించాలని కోరారు. హెచ్‌సియులో బోగస్ ఎస్సీలను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోహిత్‌కు ఎస్సీ సర్ట్ఫికెట్ జారీ చేసిన ఎమ్మార్వోను ఉద్యోగం నుంచి తొలగించాలని, రోహిత్ ఆత్మహత్య, యూనివర్శిటీలో జరిగిన పరిణామాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేవలం క్రైస్తవ మతం స్వీకరించడం ద్వారా ఎస్సీలు కాని వారు ఎస్సీలుగా ధ్రువీకరణ పత్రాలు స్వీకరిస్తున్న విషయం రోహిత్ మృతితో ప్రపంచానికి తెలిసిందని అన్నారు. వడ్డెర కులస్తుడు దర్జాగా ఎస్సీ హోదా అనుభవిస్తున్నాడని అతని తండ్రి వాంగ్మూలంతో వెల్లడైనా ఇంకా సమాజాన్ని మోసం చేయాలనే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కేంద్రప్రభుత్వం స్పందించి వెంటనే ఎస్సీ సర్ట్ఫికెట్లపై లోతైన విచారణను చేపట్టేందుకు సిబిఐని ఆదేశించాలని కోరారు.