బిజినెస్

బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం తేనుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ‘రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగ సంస్కరణలను దశలవారీగా ప్రకటిస్తాం.’ అని ఆదివారం ఇక్కడ మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భాగంగా జరిగిన సిఎన్‌ఎన్ ఆసియా బిజినెస్ ఫోరమ్ 2016లో మాట్లాడుతూ అన్నారు.
బ్యాంకింగ్ రంగంలోని 27 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను ఇప్పుడే ఉపసంహరించుకోబోమన్న అరుణ్ జైట్లీ ప్రభుత్వ వాటాను 51 శాతానికి తగ్గించుకుంటామని గతంలోనే నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ప్రకటించిన బ్యాంకింగ్ సంస్థల ఆర్థిక ఫలితాలు పేలవంగా నమోదవడంతో మొండి బకాయల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, మరికొన్ని బ్యాంకులు నష్టాల్లోకి జారుకోవడం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల లాభం కూడా గణనీయంగా పడిపోయంది. దీంతో బ్యాంకులకు విశేషాధికా రాల అంశం మరోసారి తెరపైకి వస్తోంది.
మన్మోహన్ గొప్ప ఆర్థిక మంత్రి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక మంత్రి అంటూ ప్రశంసించిన జైట్లీ.. ఆయన ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టాక మాత్రం సంస్కరణల అమలు మందగించిందని విమర్శించారు. ఆర్థిక మంత్రిగా తన హయాంలో సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్.. తాను ప్రధాన మంత్రి అయ్యాక మాత్రం అదే సంస్కరణల అమలును కొనసాగించలేకపోయారన్నారు. కీలక బిల్లుల అమలుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన అడ్డంకిగా మారిందని ఎప్పటినుంచో జైట్లీ విరుచుకుపడుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి తనదైన శైలిలో కాంగ్రెస్ తీరును ఆయన ఎండగట్టారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలును కాంగ్రెస్ తీవ్రంగా అడ్డుకుంటున్నది తెలిసిందే.