బిజినెస్

బార్‌కోడింగ్‌తో మద్యం అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: దేశంలో బార్‌కోడింగ్‌తో మద్యం అమ్మకాలు ఇప్పటి వరకు ఒక్క న్యూఢిల్లీలోనే జరుపుతున్నారని, వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధానంతో మద్యం విక్రయాలకు చర్యలు తీసుకున్నామని అబ్కారీ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఇటీవల విశాఖ వచ్చిన ఆయన ‘ఆంథ్రభూమి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ బార్ కోడింగ్ విధానం వల్ల నకిలీ మద్యాన్ని అరికట్టడంతోపాటు ఎప్పటికపుడు ఏ మేరకు అమ్మకాలు జరిగాయో తెలుసుకునే వీలుంటుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 30 శాతం మద్యం దుకాణాలు వేళలు పాటించడం లేదన్నారు. వాటన్నింటికీ చెక్ పెడతామని స్పష్టం చేశారు. మద్యం అమ్మకాలలో లీకేజీలను అరికట్టి ఆదాయ మార్గాలను పెంపొందించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే మద్యం దుకాణ యజమానులకు కంప్యూటర్లపై అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయని, అయితే విభజన తరువాత విస్తీర్ణం తగ్గడం వల్ల ఎపిలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందన్నారు. తమిళనాడు, గుజరాత్, మహారాష్టల్రో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించాయని తెలిపారు.

ఇండియన్ ఎకనోమెట్రిక్ సొసైటీ
అధ్యక్షునిగా హెచ్‌సియు ప్రొఫెసర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 19: ద ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ (టిఐఇఎస్) అధ్యక్షుడిగా 2016-17కి గాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు) స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగం డీన్, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడు ప్రొఫెసర్ బండి కామయ్య ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన టిఐఇఎస్ 52వ వార్షిక సమావేశంలో కామయ్యను ఎన్నుకున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఈ సంస్థలో దాదాపు 2 వేల మంది దేశ వ్యాప్తంగా సభ్యత్వం కలిగి ఉన్నారని, వృత్తి నిపుణులైన ఆర్థికవేత్తలంతా దీనిలో ఉన్నారని తెలిపాయి.