తెలంగాణ

నకిలీ బాబాసహా ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో లైఫ్‌స్టైల్ యజమాని కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన పరమాన్నం ఇచ్చి 1.33 కోట్లతో ఉడాయించిన నకిలీ బాబా శివకుమార స్వామిని, అతడికి సహకరించిన మరో ఇద్దరి బెంగళూరులో అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. అరెస్టు చేసిన ఆ ముగ్గురినీ మీడియా ముందు హాజరుపరిచారు. పరారైన మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఒండిగంపల్లికి చెందిన శివస్వామి గతంలో నెల్లూరు, బెంగళూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఎంతోమంది భక్తులను మోసం చేసి భారీగా నగదు, నగలు కాజేశాడని వివరించారు.