రాష్ట్రీయం

ఏమిటీ..ఇదంతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేతల తీరుతో ఎటూ పాలుపోని బాబు

విజయవాడ, డిసెంబర్ 11: తెలుగుదేశం పార్టీలోని కీలకమైన ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పలు నేరాల్లో భాగస్తులుగా వుండటంతో ఎటూ చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల పట్టుకుంటున్నారు. అవినీతి అక్రమాలకు ఆలవాలమైన తమ చర్యలను సమర్ధించుకోటానికి అలాగే రక్షించుకోటానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిడిపిలోకి వలస రావటం ప్రారంభించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై ఒకదానిపై మరొకటిగా నమోదవుతున్న కేసులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కృష్ణాజిల్లాలో ఒకవైపుగా వున్న ముసునూరు సరిహద్దుల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్కడి తహశీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం చేసిన కేసులో ప్రభాకర్ చిక్కుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పంచాయతీ చేసినప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇది సర్దుమణగక ముందే జిల్లాలో మరోవైపున కైకలూరు పరిసరాల్లో కొల్లేరు నిషేధ ప్రాంతంలో వందలాది వాహనాలతో అక్రమ రోడ్డు నిర్మాణం సాగిస్తూ ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు కారు రేస్‌లో ఒక విద్యార్థి ప్రాణాలు బలిగొన్నాడనే అభియోగం కొంతకాలం గందరగోళం సృష్టించింది. దీనిపై గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కేసులు కూడా నమోదయ్యాయి. కొద్దిరోజుల క్రితమే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబానికి చెందిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో జరిగిన కల్తీ మద్యం వ్యవహారం కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం తెలుగుదేశం నాయకులకు ఇతర ప్రత్యర్థులకు కొంత ఉత్సాహాన్ని కల్గించింది. ఈ నేపధ్యంలోనే కాల్‌మనీ వ్యవహారం తెరపైకి వచ్చింది. నీచాతినీచంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఏకమై కాల్‌మనీ పేరుతో డబ్బు వసూలు కోసం మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మాజీ శాసనసభ్యురాలు చెన్నుపాటి రత్నకుమారి సోదరుడు, మరో మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ మేనమామ అయిన చెన్నుపాటి శ్రీనివాస్ చిక్కుకున్నారు. టిడిపికి చెందిన ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పలువురు నాయకులు నేరస్థులుగా వున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ జరిగింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ఫైనాన్స్ వ్యాపారి కాగా ఆయన ఆధ్వర్యంలోనే ఇటీవల భారీఎత్తున జరిగిన సన్మాన సభకు తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకావటాన్ని ఆసరాగా తీసుకుని విపక్షాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతున్నాయి. కాల్‌మనీ వ్యవహారం ప్రస్తుతం ఇటు రాజకీయ నాయకులను, అటు పోలీస్ శాఖను కుదిపేస్తున్నది. జిల్లా కేంద్రం మచిలీపట్నంకు చెందిన మాజీ శాసనసభ్యుడు, వైసిపి నేత పేర్ని నానిని ఎక్సైజ్ అధికారులపై దౌర్జన్యం చేసారనే అభియోగంతో అరెస్టు చేయడం రిమాండ్‌కు పంపటం జరిగింది. ఈ విధంగా భూకబ్జాల నుంచి మహిళల అక్రమ రవాణా, అక్రమ మద్యం వరకు అన్ని రకాల కేసుల్లోనూ ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు భాగస్తులవుతుండటంపై కృష్ణాజిల్లాలో ఆసక్తికర పరిణామాలు ఒకదాని వెంట మరొకటిగా చోటుచేసుకుంటున్నాయి.