ఆంధ్రప్రదేశ్‌

బాబు వ్యాఖ్యలపై హైకోర్టులో వ్యాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితులపై చేసిన వ్యాఖ్యలపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో తాను దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు ఆదేశానుసారం తక్షణం సిఆర్‌పిసి సెక్షన్ 154 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు లేదా సెక్షన్ 155 ప్రకారం స్టేషన్ డైరీలో నమోదు చేయాలని లేనిపక్షంలో రాష్టవ్య్రాప్తంగా దళిత ఉద్యమం చెలరేగగలదంటూ దళిత నేత కామా దేవరాజు హెచ్చరించారు. పలు దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన గురువారం నాడిక్కడ మీడియాతో మాట్లాడారు. గత నెల 8వ తేదీ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు ఎస్‌సిలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ కులవివక్షపూరిత వ్యాఖ్యలు చేయడమే గాక ఎస్‌సిలను అవమానపరచారంటూ తాను వెనువెంటనే స్థానిక భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కొన్ని ఒత్తిళ్లపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. దీనిపై తాను న్యాయవాదులు బర్రె శ్రీనివాసరావు, సైదారావుల ద్వారా ఈనెల 3వ తేదీ హైకోర్టులో కేసు దాఖలు చేయటం జరిగిందన్నారు. తన పిటిషన్‌లో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఒన్‌టౌన్ ఎసిపి, భవానీపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై రిట్ దాఖలు చేయటం జరిగిందన్నారు. దీనిపై విచారణకు హైకోర్టు ఈ నెల 8వ తేదీ పై విధంగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. తక్షణం స్పందించని పక్షంలో హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘనపై మళ్లీ కోర్టును ఆశ్రయించడమే గాక రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమాన్ని చేపట్టగలమని దేవరాజు హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో వైకాపా ఎస్‌సి సెల్ జిల్లా చైర్మన్ కాలే పుల్లారావు, హైకోర్టు న్యాయవాది బర్రె శ్రీనివాసరావు, కార్పొరేటర్లు మల్లేశ్వరి, సుజాత, వివిధ సంఘాల నేతలు బూదాల శ్రీనివాసరావు, దుర్గారావు, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, వెంగళరెడ్డి, పైడి మురళీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.