ఆంధ్రప్రదేశ్‌

కజకిస్తాన్‌లో చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తానా:ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని కజకిస్తాన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. రాజధాని ఆస్తానాలో ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటించింది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో చంద్రబాబుకు ఆ దేశ రాయబారి సాదర స్వాగతం పలికారు. స్థానిక రాష్ట్రప్రభుత్వం, మేయర్‌లతో బాబు చర్చలు జరిపారు. అమరవాతి నిర్మాణం సహా పలు అంశాల్లో పెట్టుబడులు పెట్టాలని, ఏపీ అందుకు అనువైన రాష్టమ్రని చంద్రబాబు వారికి తెలిపారు. పర్యటన సందర్భంగా ఆస్తానాలో నిర్మించిన అతిఎతె్తైన బెతెలెక్ టవర్‌ను సందర్శించిన చంద్రబాబు టవర్‌పైనుంచి నగరశోభను తిలకించారు. ఈ నూతన రాజధాని నిర్మాణానికి గుర్తుగా 1997లో 97 మీటర్ల ఎతె్తైన బెతెలెక్ టవర్‌ను ప్రభుత్వం నిర్మించింది. కాగా చంద్రబాబు రష్యాలో జరిగే వాణిజ్య సదస్సుకు హాజరుకానున్నారు.