రాష్ట్రీయం

కాల్‌మనీ కేసులో లొంగిపోయిన సత్యానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెయిల్‌పై విడుదల మరో కేసులో అరెస్టు
విజయవాడ , డిసెంబర్ 31: కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో నాలుగో నిందితుడైన ట్రాన్స్‌కో డివిజినల్ ఇంజనీరు ఎం సత్యానందం గురువారం విజయవాడ కోర్టులో లొంగిపోయారు. హైకోర్టు ఉత్తర్వులతో మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆయన విడుదలయ్యారు. కాగా అప్పటికే నిఘా వేసిన పోలీసులు సత్యానందంను రాత్రి ఓ ఆస్పత్రిలో ఉండగా అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్‌కు తీసుకువచ్చి మరో కేసులో అరెస్టు చేశారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ ఆరోపణలపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు పటమటకు చెందిన యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీను, సత్యానందం, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్, దూడల రాజేష్‌లపై చీటింగ్, అత్యాచారం, బెదిరింపులు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే రాము, దూడల రాజేష్, భవానీశంకర్‌లను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం జైలులో రిమాండులో ఉన్నారు. కాగా సత్యానందం, చెన్నుపాటి శ్రీను, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్‌లు పరారీలో ఉన్నారు. వీరిలో సత్యానందం హైకోర్టును ఆశ్రయించగా ఈయనకు రెండు రోజుల క్రితం ముందస్తు బెయిల్ మంజూరైంది. లక్ష రూపాయల పూచీ కత్తుతో అతన్ని బెయిల్‌పై కోర్టు విడుదల చేసింది. కోర్టు నుంచి న్యాయవాదులతో కలిసి కారులో నేరుగా బృందావన్ కాలనీలోని తన తండ్రి ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సిబ్బంది ఆస్పత్రి వద్దకు చేరుకుని అదుపులోకి తీసుకుని నేరుగా పోలీసు కమిషనర్ కార్యాలయానికి, ఆ తర్వాత మాచవరం పోలీస్టేషన్‌కు, అక్కడి నుంచి ఇబ్రహీపట్నం పోలీస్టేషన్‌కు తీసుకువచ్చారు.
ఏ తప్పూ చేయలేదు: డిఇ
బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన సత్యానందం మీడియాతో మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని, తనపై కుట్ర జరిగిందని, ఉద్దేశపూర్వంగా ఇరికించారన్నారు. తన 25ఏళ్ళ ఉద్యోగ సర్వీసులో తనపై ఏవిధమైన ఆరోపణలు లేవన్నారు. తనపై ఆరోపణలు రుజువైతే ఉరిశిక్షకైనా సిద్ధమేనన్నారు. తనకు న్యాయస్థానం, పోలీసులపై నమ్మకముందన్నారు. పత్రికల్లో వచ్చినట్లు అదనపు డిజిపి ఏబి వెంకటేశ్వరరావుతో పరిచయాలు లేవని, జెఏసి నాయకునిగా పలు సమస్యలపై సీఎంను కలిసి సందర్భాలే తప్ప మరేమీ లేవని చెప్పారు. కాల్‌మనీలో తానేమీ డబ్బు పెట్టుబడులు పెట్టలేదన్నారు. (చిత్రం) బెయిల్‌పై బయటకు వస్తున్న సత్యానందం