బిజినెస్

మూడో త్రైమాసిక ఫలితాలే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో విస్తృత సంస్కరణలు తీసుకొస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం బుధవారం భారత స్టాక్‌మార్కెట్లపై ఎలాంటి సానకూల ప్రభావాన్ని కనబరచలేకపోయింది. ఈమార్పుల కంటే కూడా రానున్న రోజుల్లో కార్పొరేట్ మూడో త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనే మదుపరులు ఆశలుపెట్టుకున్నారు. మంగళవారం జరిగిన లావాదేవీల్లో బాగా పుంజుకున్న సెనె్సక్, నిఫ్టీలు బుధవారం మందగించాయి. గురువారం నుంచే టీసీఎస్,ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న దృష్ట్యా మార్కెట్ వర్గాలు ఆచీతూచీ వ్యవహరించాయి. సెనె్సక్ వివిధ దశల్లో ఊగిసలాడి అంతిమంగా 10.12 పాయింట్లు తగ్గి, 34,433. 07 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 4.80 పాయింట్లు తగ్గి 10,592.70 వద్ద ముగిసింది. హెచ్1బీ వీసాల విషయంలో ఊరట లభించడం తదితర అంశాల నేపథ్యంలో మార్కెట్ వర్గాలు అనుకున్న స్థాయిలో క్రీయాశీలకంగా వ్యవహరించలేదు. అలాగే కొత్త బడ్జెట్‌లో ఏ రకపైన ప్రతిపాదనలు ఉండబోతున్నాయన్న అంశం కూడా లావాదేవీలపై ప్రభావం చూపించింది. బుధవారం నాటి లావాదేవీల్లో టీసీఎస్ షెర్లు బాగా లాభపడి 3.64 శాతం మేరకు పుంజుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్, ఎన్‌టీపీసీ, ఏసియన్ పెయింట్స్, టాటా మోటర్స్, ఎస్‌బ్యాంక్, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో తదితర కంపెనీలు షెర్లు స్వల్పంగా నష్టపోయాయి. లాభపడిన వాటిలో టీసీఎస్‌తోపాటు విప్రో, కోల్ ఇండియా, ఇన్ఫోసీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి.