ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ క్షమాపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇటీవల ఓ సినిమా ఆడియో ఆవిష్కరణ సభలో మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు వివదాం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తాను ఇప్పటికే పార్టీ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశానని, అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ వేదికగా మరోసారి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మహిళల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం ఎంతో చేసిందని, తన సినిమాలు కూడా మహిళలను అగౌరవపరిచేలా ఉండవన్నారు.