రాష్ట్రీయం

బాసరకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 7 లక్షల ఆదాయం
1020 మంది చిన్నారులకు అక్షర శ్రీకారాలు

బాసర,డిసెంబర్ 6: చదువుల తల్లి కొలువైన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి నిలయం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర నుండి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులు గోదావరి తీరం వద్ద జల్లు స్నానాలు ఆచరించి నదీ తీరాన గల శివాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు భక్తులు అమ్మవారి దర్శన అక్షరస్వీకార క్యూలైన్లలో బారులు తీరారు. ఉద యం నుండి మధ్యాహ్నం వరకు దర్శన, అక్షర శ్రీకార సేవలకు రెండు గంటల సమయం పట్టడంతో క్యూలైన్‌లో ఉన్న వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ అధికారులు నిరంతరాయంగా అక్షర శ్రీకార దర్శన ఏర్పాట్లను కొనసాగించారు. నవరాత్రి ఉత్సవాల అనంతరం కార్తీక ఆదివారం రోజే అమ్మవారి సన్నిధిలో సుమారు 1020 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షర శ్రీకార పూజలు నిర్వహించారు. సాధారణ అక్షరాభ్యాసాలు 610, వెయ్యి రూపాయల అక్షరాభ్యాసాలు 410 జరిగాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. లడ్డూ, ప్రసాదాలు ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి రూ. 7 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
నేడు స్పీకర్ పూజలు
శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి సోమవారం కుటుంబ సమేతంగా బాసర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆలయంలో అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని తన మనవడికి అక్షర శ్రీకార పూజలు నిర్వహించడానికి ఆలయానికి రానున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. (చిత్రం) అక్షరశ్రీకార పూజల కోసం అక్షరాభ్యాస మండపంలో భక్తుల కోలాహలం