ఆంధ్రప్రదేశ్‌

బయోమ్యాక్స్‌లో తగ్గుముఖం పట్టిన మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఇక్కడి దువ్వాడ సెజ్‌లోని బయోమ్యాక్స్ రసాయన కర్మాగారంలో గురువారం ఉదయానికి మంటలు తగ్గుముఖం పట్టాయి. ఈ కర్మాగారంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించగా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు రెండురోజులుగా శ్రమించాయి. నేవీ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించి మంటలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకున్నారు. మంటల వల్ల 12 చమురు ట్యాంకులు దగ్ధమై దాదాపు 125 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు బయోమ్యాక్స్ ప్రతినిధులు చెబుతున్నారు.