రాష్ట్రీయం

భద్రాద్రిలో రామాయణ మహాక్రతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 10: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం శ్రీరామాయణ మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది. 100 ఏళ్ల తర్వాత శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణ కవచం మార్చుతున్న సందర్భంగా ఈ క్రతువును ప్రారంభించారు. ఇందులోభాగంగా స్థానిక గోశాల పక్కన యాగశాలను నిర్మించారు. ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి మూలవరుల వద్ద ఉత్సవానుజ్ఞ తీసుకుని అర్చకులు భద్రగిరి ప్రదక్షిణం చేశారు. యాగశాల వద్ద ఓంకార రామధ్వజారోహణం చేసి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, శాలావాస్తు, పర్యగ్నీకరణం, సుదర్శనమూర్తితో యాగశాల ప్రవేశం చేశారు. సాయంత్రం పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం మృత్సంగ్రహణం, అంకురార్పణం, అఖండ దీపస్థాపనం, ద్వార తోరణ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాల సమీపంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి సుందరకాండ పారాయణం చేశారు. ప్రముఖ గాయకుడు ఎంఎస్ రామారావు మనుమడు శ్రీనివాస్ ఆలపించిన సుందరకాండ కీర్తనలు భక్తులను పారవశ్యంలో ముంచాయి. ఈ కార్యక్రమంలో ఈఓ కూరాకుల జ్యోతి, ప్రధానార్చకులు పొడిచేటి హరిజగన్నాథాచార్యులు, రామానుజం, మురళీకృష్ణమాచార్యులు, ఎస్టీజీ శ్రీమన్నానారాయణాచార్యులు, రామస్వరూపాచార్యులు తదితరులు పాల్గొన్నారు.