రాష్ట్రీయం

అప్పుకోసం ‘భగీరథ’యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20వేల కోట్లకోసం సంప్రదింపులు
మూడేళ్లలో పథకం పూర్తి
నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం
అసెంబ్లీలో కెటిఆర్ ప్రకటన
హైదరాబాద్, మార్చి 17: ప్రతిష్ఠాత్మకమైన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని, ప్రతి ఇంటికి మంచినీటి నల్లాకనెక్షన్ ఇస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.36,900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. బ్యాంకులు, వివిధ ఏజన్సీలు, నాబార్డ్ ద్వారా రూ. 20 వేల కోట్ల రుణాలను పొందేందుకు సంప్రదింపులు చేస్తున్నామన్నారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యేలు జి కిషోర్‌కుమార్, పుట్టా మధుకర్, బిజెపి శాసనసభాపక్షనేత డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, తమ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో నీళ్లు ఇవ్వకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగం అని ఆయన చెప్పారు. మొదటి దశ పనులు మంచి పురోగతిలో ఉన్నాయన్నారు. హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్ గోదావరి పైపులైను ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నాలుగు ప్యాకేజీల్లో పనులు చురుకుగాసాగుతున్నాయన్నారు. మిషన్ భగీరథ కింద మొదటి దశలో మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లో భాగం, గజ్వేల్, దుబ్బాక, మెదక్ జిల్లాలోని సిద్ధిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌లో భాగం, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో భాగం, జనగాం, స్టేషన్ ఘనాపూర్‌లోని ప్రాంతాలు, పాలకుర్తిలో భాగం, వరంగల్ జిల్లా తుంగతుర్తి పరిసర ప్రాంతాలకు నీటి కనెక్షన్లను సమకూర్చాలని ప్రతిపాదించామన్నారు. 2018 చివరి నాటికి 99 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24224 ఆవాసాలకు మంచినీటిని సరఫరా చేస్తామన్నారు.