రాష్ట్రీయం

సహాయ చర్యలు అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్ సలహాదారు అశోక్‌కుమార్
విపత్తు నిర్వహణ పనులకు 210 కోట్లు మంజూరు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు

హైదరాబాద్, డిసెంబర్ 5: రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి, రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ, అగ్నిమాపక శాఖకు రూ.210 కోట్ల నిధులను మంజూరైనట్లు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద ఈ నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఇందులో భాగంగా తొలి విడతగా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి రూ.10కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. శనివారం ఇక్కడ ఆయన నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి అయోగ్) సలహాదారు అశోక్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల పరిస్ధితిని కేంద్ర సలహాదారుకు వివరించారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 46 మండలాల్లో 45 మండలాలు, చిత్తూరు జిల్లాలో 66 మండలాల్లో 60 మండలాలు, కడప జిల్లాలో 26 మండలాలు, ప్రకాశం జిల్లాలో 11 మండలాల్లో 250 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య ఈ వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో పోతిగుంట ఏడబ్ల్యుఎస్ స్టేషన్‌లో 924 ఎంఎం, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో 875.3 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అన్ని కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మొహరించామన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలను నీతి అయోగ్ సలహాదారు అశోక్ కుమార్ ప్రశంసించారు. కేంద్ర బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటించి అవసరమైన సహాయ చర్యలు తీసుకుంటుందన్నారు. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జెసి శర్మ, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఆదిత్య ఎన్‌దాస్, డిజాస్టర్ మేనేజిమెంట్ డైరక్టెర్ కె ధనుంజయ్ రెడ్డి ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.