సబ్ ఫీచర్

ఒకరికొకరు సాయం అంతంతమాత్రమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సమాజంలో ఇంటి పనిలో భార్యకు సహాయపడటం పరువు తక్కువ పనిగా భావించే పురుషుల శాతం చాలా ఎక్కువ. మహిళలు వంట, పడకింటికి మాత్రమే పనికివస్తారనే దురభిప్రాయం కొంతమందిలో వుంది. ఇంటి పనిలో భార్యలకు సహాయపడేవారిని ఎద్దేవా చేయడం కూడా మనం తరచూ చూస్తూనే వుంటాం. అయితే భార్యాభర్తలనేవారు సంసారం అనే ఎద్దులబండికి కట్టబడిన జోడెద్దులు వంటివారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రెండు ఎద్దులు సక్రమంగా నడిచినపుడే బండి ప్రయాణం సజావుగా సాగుతుం ది. అదేవిధంగా భార్యాభర్తలు ఇరువురూ పరస్పరం ఇంటి పనిలో సహరించుకొంటే ఆ ఇల్లు నందనవనం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి ఆచరణలో చేసి చూపుతున్న ఘనత స్లోవేనియా దేశంలోని పురుషులకే దక్కుతుంది. ఇంటి పనిలో భార్యలకు సహకరిస్తున్న భర్తలు అనే అంశంపై ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో స్లోవేనియా దేశంలోని పురుషులు ఇంటి పనిలో తమ భార్యలకు రోజుకు సగటున 114 నిమిషాలు సహాయపడుతున్నారు. డెన్మార్క్‌లోని పురుషులు 107 నిమిషాలు, ఫ్రాన్స్‌లోని పురుషులు 98 నిమిషాలు, ఆస్ట్రియాలోని పురుషులు 93 నిమిషాలు తమ భార్యలకు సగటున రోజూ సహయపడుతున్నారు. మన దేశంలో మాత్రం రోజుకు సగటున 19 నిమిషాలు మాత్రమే భర్తలు తమ భార్యలకు ఇంటిపనిలో సహాయపడుతున్నారు. మన దేశంలో గత రెండు దశాబ్దాల కాలంగా మహిళలు ఉద్యోగాలు చేయడం ఎక్కువ అయింది. సాఫ్ట్‌వేర్ రంగం బాగా అభివృద్ధి చెందిన తరువాత, ఉద్యోగాలు చేసే మహిళల శాతం బాగా పెరిగింది. దీంతో భర్తలు తప్పనిసరి పరిస్థితులలో కొంతవరకు తమ భార్యలకు ఇంటి పనిలో సహకరించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. మన దేశంలో మహిళా ఉద్యోగినులు తీవ్రమైన వత్తిడికి గురవుతూ, తద్వారా పలు ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకొంటున్నారు. ఇంటి పని సకాలంలో పూర్తిచేసుకొని తమ విధులకు హాజరవ్వడం వారికి తలకు మించిన భారంగా మారింది. మన దేశంలో రోజుకు ఇంటి పనిలో భార్యలకు సహకరించే పురుషుల సగటు సమయం 19 నిముషాలు అయింది. మహిళలు ఉద్యోగాలు చేయని కాలంలో అయితే ఈ సమయం ఎంత దారుణంగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకనైనా మన దేశంలోని పురుషులు అనవసర భేషజాలను విడనాడి స్లోవేనియా పురుషులను ఆదర్శంగా తీసకొంటే చాలా బాగుంటుంది. మహిళా ఉద్యోగులు చాలావరకు వత్తిడికి దూరమై, ప్రశాంత జీవనం గడుపుతారు. వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు కూడా చాలావరకు తగ్గిపోతాయి.

- హైమావతి