సబ్ ఫీచర్

సిగ్గు, బిడియం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిగ్గు బిడియం ఏదో ఒక సందర్భంలో అందరికీ అనుభవంలోకి వచ్చేవే. కాని నిరంతరం అలాగే వుండటం కొందరిలో కనిపిస్తుంది. ఇది వారి జీవితాలను వృత్తిపరంగా, సామాజికంగా, కుటుంబ పరంగా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది. బిడియం పోకొట్టుకోవడానికి అలాంటివారు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. దీన్ని సరిచేయడం ఎలా.. అసలు ఈ బిడియం ఎందుకు కలుగుతుంది? ఒంటరిగా గడపాలనుకోవడం ఎందుకు? అసలది నిజంగా ఓ సమస్యేనా? ఇవీ పరిశోధకులను వేధిస్తున్న ప్రశ్నలు. స్వభావ అధ్యయనాలు, బ్రెయిన్ స్కానింగ్‌లు, జన్యుపరీక్షలు.. ఇలా ఎన్నో తంటాలు పడి ఎట్టకేలకు సైంటిస్టులు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టగలిగారు. ఏది సిగ్గరితనం, ఏది కాదనే నిర్వచనానికి వీరి అధ్యయనాలు తోడ్పడతాయి. సెలవు రోజుల్లో కూడా కదలకుండా ఇంట్లోనే వుండి పుస్తకం చదువుతూ, ఒంటరిగా గదిలోనే గడపాలని విద్యార్థి లేదా ఓ యువకుడు భావించవచ్చు. అంతమాత్రాన దాన్ని ఎవరితో కలవకపోవడం అనలేం. రణగొణ ధ్వనులతో వుండే రోడ్లమీద తిరగటం కంటే, గోల గోలగా వుండే పార్టీలకి వెళ్ళటం కంటే హాయిగా నిశ్శబ్ద వాతావరణంలో చక్కటి పుస్తకం చదవటం మీకిష్టం కావచ్చు. ఒకవేళ పార్టీలకి వెళ్ళాలంటే భయపడి ఆందోళన చెంది మానేస్తేనే అది బిడియం కిందకి వస్తుంది. కొత్తవారితో కలిసినపుడు సాధారణ స్థాయి కంటే అధికంగా టెన్షన్‌కు, అయోమయానికి గురైతే అది బిడియ స్వభావం అవుతుంది అని హార్వార్డ్ యూనివర్సిటీ సైకాలజిస్టు జిరోమ్ కాగన్ చెప్తున్నారు. దీని ప్రకారం చూసినా, మనలో 30 శాతం మంది ఈ తరగతి కిందకు వస్తారు. మిలన్‌లోని శాన్ రాఫెల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మార్కో బిట్టాగ్లియా ఇటీవలే బిడియంపై ఓ అధ్యయనం ప్రచురించారు. 3-4 తరగతుల పిల్లలపై ఆయన ఈ అధ్యయనం చేశారు. దీని ప్రకారం మెదడులోని కార్టెక్స్‌కు, బిడియానికి లింకు వుందని తేలుతోంది. సంక్లిష్టమైన ఆలోచనలు రూపుదిద్దుకునేది కార్టెక్స్ ప్రాంతంలోనే. బిడియస్తులలో కార్టెక్స్ అంత చురుగ్గా లేదు. దానికి బదులు ‘అమిగ్థలా’ భాగం వారిలో ఎక్కువగా పనిచేస్తోంది. ఈ ‘అమిగ్థలా’ ఆందోళనకు, హెచ్చరిక సంకేతాలకు కేంద్ర స్థానం. పిల్లల బొమ్మలను చూసినపుడు వారి మెదడులో ఏ భాగాలు ఎలా స్పందిస్తున్నదీ ఈఈజీ (ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్) సంకేతాల ద్వారా మార్కో నమోదు చేశారు. ముందుగా 49 మంది పిల్లలను ఎవరు ఎంత బిడియస్తులో సాధారణ పరిశీలన ద్వారా గ్రేడింగ్ చేశారు. కోపం, ఆనందం, భావరహితం ఇలా రకరకాల భావోద్వేగాలను వ్యక్తీకరించే ముఖాల బొమ్మలను చూపించి అవెట్లా ఉన్నాయో చెప్పాలని అడిగారు. ఎక్కువ బిడియస్తులు కోపం, తటస్థ భావాలను గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. వారిలోనే కార్టెక్స్ భాగం మందకొడిగా వుండి అమిగ్థలా ఎక్కువగా పనిచేసింది. ఇతర పిల్లల్లో అందుకు భిన్నంగా కనిపించింది.
సాధారణ సామాజిక సంబంధాలను కలిగి వుండడానికి ఈ ముఖ కవళికలను అర్థం చేసుకోవడం కీలకమని మార్కో తేల్చాడు. కార్టెక్స్‌ను ఉత్తేజపరచటం ద్వారా దీన్ని పోగొట్టవచ్చని అనుకోవచ్చు.

-బి.మాన్‌సింగ్ నాయక్