మెయిన్ ఫీచర్

అందాల భామల అల్పాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీర ఆరోగ్యానికి ఎక్కువ దోహదం చేసేది ఉదయం తీసుకునే అల్పాహారమే. ఈ సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రొటీన్లు ఉండేలా కూరగాయలు, పండ్లు, పాలు తదితరవాటిని అల్పాహారంగా తీసుకుంటే ఉత్తమం. వివిధ కారణాల వల్ల ఉదయం తీసుకునే అల్పాహారం పట్ల చాలామంది మక్కువ చూపటం లేదు. కాని రాత్రంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా పొట్టను ఖాళీగా ఉంచేస్తాం.
ఆరేడు గంటలు దాటిన తరువాత కూడా ఆహారం తీసుకోకపోతే నీరసమే కాదు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మనం మన ఉద్యోగ బాధ్యతలతోగానీ, ఇంటి బాధ్యతలతో కానీ ఎంత తీరిక లేకుండా ఉన్నా అల్పాహారం వదులుకోకూడదు.అందుకే అల్పాహారానికి అందరూ ప్రాధాన్యత ఇచ్చినట్లే సినిమా హీరోయిన్లు కూడా ఇస్తారు. వారు ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేమి తీసుకుంటారో తెలుసుకుందాం.
మలైకా అరోరా ఖాన్ :
తల్లయినా మలైకా అరోరా ఖాన్ చయ్య చయ్య అంటూ ఆనా టి కుర్రకారును ఉర్రూతలూగించింది. ఈమె ఉదయం వేళ ప్లేట్ ఇడ్లీ తీసుకుంటుంది. సీజనల్ పళ్లను చిన్న బౌల్ చొప్పున ప్రతిరోజూ తింటుంది.
దీపికా పదుకునే :
దీపికా దక్షిణ భారత ఆహారపు అలవాట్లను ఇష్టపడుతోంది. ఉదయం వేళ ఉప్మా, దోశ, కోడిగుడ్డులోని తెల్లసొనతో తయారుచేసిన ఆమ్లెట్ తింటుంది. చాలామంది హీరోయిన్లు తింటానికి భయపడతారు. కాని ఈ చెన్నై ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌గా లాగించేస్తోంది. గుండె సంబంధ వ్యాధులు వస్తాయనే బెంగలేదు. దీనికితోడు స్పోర్ట్స్ జీన్స్ ఉండటం వల్ల చలాకీగా ఉంటుంది.
కరీనాకపూర్ :
పటౌడి యువరాణి రోజూవారీ తన దినచర్యను ఉదయం అరటి పండు తినటంతో ఆరంభిస్తుంది. దీంతో పాటు ఓ కప్పు కమ్మని కాఫీ తాగుతుంది. కప్పు నట్స్, కప్పు పెరుగు తీసుకుంటుంది.
మల్లికాషెరావత్ :
ఆరోగ్యకరమైన ఆహారానే్న తీసుకుంటుంది. కోడిగుడ్లు, తృణధాన్యాల టోస్ట్, ఒక బౌల్ పళ్ల ముక్కలు తీసుకుంటుంది. ఉదయం పని అయిన తరువాత కోడిగుడ్డులోని తెల్లసొనను ఆహారంగానూ, బననా షేక్ తీసుకుంటుంది.
మందిరాబేడి :
43ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం కోడిగుడ్డులోని తెల్లసొన ఆమ్లెట్ లేదా టోస్ట్ కప్పు కాఫీ తీసుకుంటుంది. అంతేకాదు ఒక ప్లేట్ స్పాగెట్టీ తీసుకుంటుంది.
శిల్పాశెట్టి:
ఓ పిల్లాడికి తల్లయిన శిల్పాశెట్టి పూర్తి శాఖాహారి. ఓక్క గురువారం మాత్రం చేపను ఆహారంగా తీసుకుంటుంది. యోగా నిపుణురాలు. ఆహారం విషయంలో కొలతల ప్రకారం తీసుకుంటుంది. రోజూ రెండు వేల కేలరీల ఆహారం మాత్రమే తీసుకుంటుంది. ఇందులోనే బ్రేక్‌ఫాస్ట్ మిళితమై ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్ షేక్, రెండు ఖర్జూరాలు, 8ఎండు ద్రాక్షాలు తీసుకుంటుంది.
ఇలియానా :
ఈ బర్ఫీ గాల్ అవిశగింజెల తృణధాన్యాలను ఒక బౌల్, గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్‌తో పాటు పళ్ల రసం తీసుకుంటుంది.
మాధురీదీక్షిత్ :
వయసు పెరిగినా శృంగార నాయకిగానే పిలుచుకునే ఈ ఢక్ ఢక్ సుందరి భారతీయ సాంప్రదాయ వంటకాలనే ఇష్టపడుతుంది. అంతేకాదు పళ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటుంది.
ప్రియాంకా చోప్రా :
నీకు ఏది ఇష్టమైతే అది తినేసి, అధికంగా ఉండే క్యాలరీల కోసం జిమ్‌కు వెళితే సరి అని సింపుల్‌గా చెబుతుంది. కానిఈమె మాత్రం తన బ్రేక్‌ఫాస్ట్‌లో పప్పు- రోటీ, మూడు ఎండుద్రాక్ష, 2.5 బాదం పప్పు, 0.75 గ్లాస్ కొబ్బరి నీళ్లను మాత్రమే తీసుకుంటుంది.