సబ్ ఫీచర్

ఆరోగ్యం కోసం ఆహారం తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శెలవు రోజులలోనూ, ఇంకా ఇతర సందర్భాలలోనూ మనలో చాలామంది బయట రెస్టారెంట్లలో తినటానికి మక్కువ చూపిస్తారు. నిజమే, రోజూ తినేది ఇంటి భోజనమే కదా, అప్పుడప్పుడు ఇలా బయట తింటూంటే భలే మజాగా వుంటుంది అని అనుకుంటాం. కానీ అన్ని ప్రాంతాలలో, అన్ని ప్రదేశాలలో అందరికీ అందుబాటులో శుచిగా, శుభ్రతా, ఆరోగ్యకరమైన ఆహారం దొరక్కపోవచ్చు. దానితో ఏది లభిస్తే అది తినేస్తాం. ఒక్కసారికేగా ఏమవుతుందిలే అనుకుంటాం. ఏదైనా చేటు జరగటానికి ఆ ఒక్కసారి చాలు.
మనిషి ఆరోగ్యం ఈ విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆహారపు అలవాట్లు, ఎంత సమయం నిద్రపోతున్నారు, శారీరంగా ఎంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు, ఇతరులతో సన్నిహిత బాంధవ్యాలు, అనుబంధాలు, సంబంధాలు వంటివి ప్రతి మనిషి జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. గత దశాబ్దకాలంలో ప్రతి మనిషి జీవన శైలిలో స్పష్టమైన, చెప్పుకోదగిన మార్పు వచ్చింది. నిత్యకృత్య కార్యక్రమాలు, పనులకి సంబంధించిన తీరిక లేని క్షణాలతో మనుషులు వారి ఆరోగ్యం పట్ల, జీవన విధానంపట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. నిత్యం లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత వ్యాయామం చేయటం, విశ్రాంత జీవనం, నిదానంగా పనులు చేసుకోవడం, పోషక విలువలు కలిగిన అల్పాహారం తయారుచేసుకోవటం వంటివాటికి తిలోదకాలు ఇచ్చేశారు. ఆదరాబాదరాగా లేవటం, హడావుడిగా పనులు చేసుకోవటం, ఏదోఒకటి చేసుకుని (అల్పాహారంగా) తినేసి ఆఫీసుకు వెళ్లిపోటం - ఇదే ప్రస్తుతం చాలామంది విషయంలో జరుగుతోంది.
ప్రస్తుతకాలంలో తినటానికి సిద్ధంగా ఉన్న అల్పాహారం (రెడీ టూ ఈట్), ఇన్‌స్టెంట్ ఫుడ్స్, స్నాక్స్, ఇంకా ఇతర రకాల ఆహార పదార్థాలు మన నిత్య కృత్యాలలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చాయి.
20 సంవత్సరాల క్రితం మన దేశంలో ప్యాకింగ్ ఫుడ్స్‌కి అంత పేరు లేదు. అదే ఈ రోజులలో అది ప్యాకేజ్‌డ్ జ్యూస్‌గానీ, ఆహారంగానీ రకరకాలుగా లభిస్తోంది. అయినప్పటికీ రుచికి, శుచికి, పోషక విలువలకు ఇంటి భోజనాన్ని మించింది లేదన్నది మాత్రం నిజం. అందుకని ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదైన ఇంటి భోజనానికే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వండి. సరేనా! మరచిపోకండి!

అసలు విషయానికి వస్తే ఇంటి భోజనానికి సాటి ఏదీ ఉండదు. రెడీమేడ్‌గా బయట లభించే ఆహారం సులువుగా వస్తుంది కదా అనుకున్నప్పటికీ, రుచికి, శుచికి, పోషక విలువలకు ఇంటి భోజనాన్ని మించింది లేదు. అలాగే ఉదయం తీసుకునే అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కూడా. ప్రతిరోజూ క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. మనం మన ఉద్యోగ బాధ్యతలతోగానీ, ఇంటి బాధ్యతలతో కానీ ఎంత తీరిక లేకుండా ఉన్నా అల్పాహారం వదులుకోకూడదు.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- మనస్విని