సబ్ ఫీచర్

గ్రామాన్ని తీర్చిదిద్దారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులో సేవ చేయాలనే సంకల్పం కలిగితే సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతాం. ఈ దంపతులది కూడా ఇదే ఆలోచన. టీనేజ్ వయసు నుంచి ఇద్దరూ పరులకు ఏదోరకంగా చేయాలనే తాపత్రయపడేవారు. విచిత్రంగా ఒకే ఆలోచన ఉన్న ఈ ఇద్దరినీ పెళ్లి అనే బంధం కలిపింది. ఎక్కడో ఎవరికో సేవ చేయటం ఎందుకు జన్మభూమికే సేవచేస్తే జీవితానికి సార్థకం ఉంటుందని భావించి లక్షల్లో వచ్చే ఆదాయాన్ని సైతం వదులుకొని స్వదేశానికి వచ్చారు. మహారాష్టల్రోని లన్వాడి అనే వెనుకబడిన గ్రామాన్ని దత్తతు తీసుకుని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దారు.
ఆశిష్‌కుమార్ సొంతూరు పూణె వెళ్లటానికి రైల్వే స్టేషన్‌లో నిలబడ్డాడు. ఇంతలో ఓ చిన్న బాలుడు అతని బూట్లు తుడుస్తానని ప్రాధేయపడుతున్నాడు. నాకు ఇపుడు అవసరం లేదు అని అంటున్నా వినటం లేదు. ఈ బూట్లు తుడవటం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని లాలానగా అడిగితే ఇలా పనిచేస్తే వచ్చే డబ్బులతో చదువుకుంటున్నానని చెప్పాడు. ఆ చిన్నారి చెప్పిన మాటలు అతనిలో సరికొత్త ఆలోచనలకు నాంది పలికాయి. అంతేకాదు ఆ చిన్నారికి అడిగినంత కన్నా ఎక్కువగానే డబ్బులు చేతిలో పెట్టాడు. అపుడు ఆ పసి మోములో కలిగిన ఆనందాన్ని చూసి ఇలాంటి దురదృష్టవంతులకు ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు.
ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివిన ఆశిష్‌కుమార్, రూతు అనే ఈ దంపతులు వృత్తిరీత్యా ఎన్నో దేశాలు తిరిగారు. చివరకు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఈ దంపతులు స్థానిక దేవాలయాలకు వెళ్లి సేవ చేస్తుండేవారు. ఎక్కడో సేవ చేయటం దేనికి జన్మనిచ్చిన మాతృదేశానికి సేవ చేస్తే జన్మ సార్థకం అవుతుందని భావించి 2012లో ఇండియాకు తిరిగివచ్చారు. ఇక్కడ మహారాష్టల్రోని కుగ్రామమైన ‘లన్వాడి’ని దత్తత తీసుకున్నారు.
ఈ గ్రామంలో విద్యుత్, నీరు, రోడ్డు వంటి కనీస సదుపాయాలే లేవు. అక్కడి ప్రజలకు టాయిలెట్స్ ఎలా ఉంటాయో తెలియదు. అలాంటి గ్రామాన్ని ఈ దంపతులు మార్చేశారు. గ్రామ సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాత ఆశిష్ కుమార్ భార్య రూతు టాయిలెట్స్ కట్టించాలని నిర్ణయించుకున్నారు. ఇంటికో టాయిలెట్ నిర్మించుకుంటే పరిసరాలు శుభ్రంగా ఉంటాయని గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరి కృషి ఫలితంగా ఇపుడు ఆ గ్రామస్తులు టాయిలెట్స్ ఉపయోగించుకుంటున్నారు. గ్రామంలో రెండు బయో టాయిలెట్స్ సైతం నిర్మించారు. గ్రామానికి విద్యుత్, రోడ్డు సదుపాయాలు సమకూరాయి. ఈ బయో టాయిలెట్స్ బస్సులు ఆగే ప్రాంతాల్లో ప్రయాణీకుల కోసం నిర్మించారు. లన్వాడిని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దటానికి అవసరమైన నిధుల కోసం ఆశిష్ కుమార్ తన సొంత డబ్బులతో పాటు స్నేహితుల నుంచి విరాళాలు సేకరించాడు. ఇందులో పది శాతం నిధులు మాత్రమే గ్రామస్తులు సమకూర్చారు. మిగిలిన నిధులన్నీ అతని కష్టార్జితం, స్నేహితులు ఇచ్చిన నిధులే. లక్షల్లో వచ్చే జీతాన్ని కాదనుకుని తమకోసం తపనపడుతున్న ఈ దంపతులను గ్రామస్తులు సైతం అక్కున చేర్చుకున్నారు.