మెయిన్ ఫీచర్

వీరవనిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైన్యంలో పనిచేసే భర్త.. అందమైన కాశ్మీర్..
నిత్యం గర్వపడుతూండేది...
దేశం కోసం చక్కటి బాధ్యత నిర్వహిస్తున్నామని...
ఇంతలో జీవితంలో అనుకోని మలుపు... ఓ పెద్ద కుదుపు..
అంతా బాగానే ఉందనుకున్న వేళ.. ఉగ్రవాదులు తెగబడ్డారు...
తరిమికొట్టేందుకు కల్నల్ వసంత్ ప్రాణాలొడ్డి పోరాడారు. దేశం కోసం చేసిన పోరాటంలో వీరమరణం తప్పలేదు... 2007లో ఉరీ సెక్టారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలతో, ఎన్నో కలలతో కాశ్మీర్‌లో అడుగుపెట్టిన సుభాషిణి తేరుకునేసరికి ప్రపంచం ఏంటో తెలిసింది. భర్త లేని తను ఇద్దరు పిల్లల్ని సాకుతూ జీవితాన్ని కొనసాగించడానికి ఆమెకు ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు. బంధువులు, తెలిసినవారి నుంచి సహకారం అంతంతమాత్రమే. బాగా చదువుకున్న తనకు, సైన్యాధికారి భార్యగా ఉన్న తనకే ఇన్ని కష్టాలు ఎదురైతే... ఇక తన భర్తలా వీరమరణం పొందిన సైనికుల సాధారణ కుటుంబాల పరిస్థితి ఏమిటోనన్నది ఆమెను ఆందోళనకు గురిచేసింది. భర్త లేడని కుంగిపోకుండా తన కుటుంబంతోపాటు ఇతర బాధిత కుటుంబాలను ఆదుకోవాలనుకుంది. తను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న నృత్యాన్ని నమ్ముకుంది. నాటకాలను నమ్ముకుంది. ప్రదర్శనలు నిర్వహించి విరాళాలు సేకరించింది. వీటిని సద్వినియోగం చేయడానికి భర్త పేరుతో ఓ ఫౌండేషన్‌ను 2009లో ఏర్పాటు చేసింది. ఆ ఫౌండేషన్ పేరు వసంతరత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్. మొదట ఢిల్లీ, ఆ తరువాత బెంగళూరు, ఇప్పుడు చెన్నై వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తన ఇద్దరు కూతుళ్లు కాస్త పెద్దవారైనారు. ఫౌండేషన్ వ్యవహారాలు వారే చూస్తున్నారు. స్నేహితుడు కెప్టెన్ రవి సహకారంతో నిర్వహిస్తున్న పెగసస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌నూ కార్యరంగంలోకి దింపింది. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడం, పిల్లలకు స్కాలర్‌షిప్, ఉన్నత చదువులకు ఆర్థికంగా తోడ్పడటం, అవసరమైన ఉత్తరప్రత్యుత్తరాలు రాయడం వంటివి ఫౌండేషన్ చేస్తోంది. ఇక ప్రాణత్యాగం చేసిన సైనికుల భార్యలను వంటింటికే పరిమితం చేయడాన్ని చూసి సుభాషిణి తట్టుకోలేకపోయింది. వారిని బాహ్య ప్రపంచంలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. వారి అత్తమామలు, తల్లిదండ్రులు, బంధువులను ఒప్పించేందుకు ప్రయత్నించింది. సంప్రదాయాల ముసుగులో వారు అభ్యంతరాలు చెప్పడం ఆమె తట్టుకోలేకపోయింది. చివరకు వారి పిల్లలకు ఇస్తున్న స్కాలర్‌షిప్స్ నిలిపివేస్తామని బెదరించడంతో ఫలితం దక్కింది. ఇప్పుడు బాధిత మహిళలు బయటకు వస్తున్నారు. వీరికోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అన్ని విషయాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెగసస్ సంస్థతో కలసి 3సెల్యూట్ టు హీరోస్2, 3గిఫ్ట్ ఓ బర్త్‌డే2 వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. భర్తను కోల్పోయిన సైనికుని భార్య పుట్టినరోజు సందర్భంగా పూలగుత్తులు, ఒక గ్రాము బంగారం, వారి పిల్లల పుట్టినరోజునాడు పెన్సిల్స్, పెన్నులు, పుస్తకాలు కానుకగా ఇవ్వడం ఒక కార్యక్రమం. సైన్యం గొప్పతనం, అక్కడ పనిచేసేవారు హీరోల్లాంటివారని చాటిచెప్పే కార్యక్రమం మరోటి. అంతకుముందు వసంత్త్న్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్స్ ఇవ్వడం మొదలెట్టింది సుభాషిణి. 5-15 ఏళ్లలోపు 50 మందికి ఇలా ఉపకారవేతనం ఆ ఫౌండేషన్ ఇస్తోంది. మరో 40 కుటుంబాలు ఈ ఫౌండేషన్ సహకారంతో ముందుకువెళుతున్నాయి. దేశవ్యాప్తంగా తన సంస్థ కార్యక్రమాలు విస్తరింప చేయాలన్నది ఆమె కల. భర్త ఉన్నప్పుడు సైనికుడి భార్యగా గర్వపడేది... ఇప్పుడు సైనికుల కుటుంబాల ప్రతినిధిగా తృప్తిపడుతోంది సుభాషిణి.

జీవితమే నాటకరంగం

భరతనాట్యం అంటే ఆమెకు ప్రాణం. ఐదవ ఏట నుంచే నేర్చుకుంది. నాటకాలన్నా అంతే ఇష్టం. పెళ్లైన కొత్తలో ఆమె 3సైలెంట్ ప్రంట్2 అనే నాటకం రాసింది. సైన్యంలో మూడు తరాల ప్రతినిధులకు సంబంధించి, స్వాతంత్య్రానికి ముందు, కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులను పోలుస్తూ రాసిన కథ ఇది. సుభాష్ చంద్రబోస్ సారథ్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన సైనికుడి కుమార్తె ఆశ. ఆమె కథ ఇతివృత్తం. ఆమె తండ్రి ఓ సైనికుడు. ఇది స్వాతంత్య్రానికి పూర్వం. ఆమె భర్త సైనికుడిగా పనిచేస్తూ వీరమరణం పొందాడు. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి పరిస్థితి. ఆమె కొడుకు కార్గిల్ యుద్ధంలో విజయం చవిచూసిన సైనికాధికారి. ఈ నాటకాన్ని రాసినప్పుడు వసంత్ జీవించి ఉన్నారు. కానీ ప్రదర్శించేనాటికి లేరు. దీనిపై సుభాషిణి స్పందన కన్నీరు తెప్పిస్తుంది. 3ఈ నాటకంలో ఆశ కేవలం ఓ పాత్ర. నిజజీవితంలో నేను 3ఆశ2లా మారిపోయాను. ఇదే జీవితం2 అంటారు. నాకిష్టమైన నాట్యం, నాటకం నాకు ఆలంబన అయ్యాయి. కేవలం ఇష్టంతోనే వాటిని నేర్చుకున్నాను. కానీ అవి ఇప్పుడు అండగా నిలిచాయంటారామె. న్యూఢిల్లీలో ఆర్మీవైవ్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. అప్పటి రక్షణమంత్రి ఎకెఆంటోనీ హాజరై భావోద్వేగానికి గురయ్యారు. ఫౌండేషన్‌కు సహకరించారు. ఆ తరువాత బెంగళూరులో ఇదే నాటకాన్ని ప్రదర్శిస్తే 3 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయి. అదంతా ఫౌండేషన్ కార్యక్రమాలకే కేటాయిస్తున్నారు.

-పి.హైమావతి