రాష్ట్రీయం

కొమరవోలులో బయోటెక్నాలజీ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, డిసెంబర్ 12: దేశానికి కేటాయింపు జరిగే బయో మాలిక్యులర్ పరిశోధనా సంస్థను కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలు గ్రామం వద్ద ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు సిఐఐ జాతీయ బయోటెక్నాలజీ సభ్యుడు ఎం కృష్ణప్రసాద్ వెల్లడించారు. గ్రామాభివృద్ధి కోసం కొమరవోలును దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శనివారం గ్రామంలో స్మార్ట్ విలేజ్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన కృష్ణప్రసాద్ తొలిసారిగా గ్రామానికి వచ్చి సమీక్షలో మాట్లాడారు. స్విట్జర్లాండ్‌లోని లూజాన్ బయో మాలిక్యులర్ సంస్థ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీతో కలిసి సంయుక్తంగా త్వరలో కాకినాడు, అనంతపురంలలో సదస్సులు నిర్వహించనున్నాయని తెలిపారు. దేశానికి కేటాయించే సంస్థను కొమరవోలులో నిర్మించేలా ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. సమీక్షలో మరో బయోటెక్ సంస్థ ప్రతినిధి ఎం శంకర్‌ప్రసాద్ మాట్లాడుతూ కెనడా దేశానికి చెందిన బయో ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను కూడా మాలిక్యులర్ సంస్థకు అనుబంధంగా పెట్టవచ్చని అన్నారు. శంకర్‌ప్రసాద్, కృష్ణప్రసాద్‌ల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని చెప్పారు.