'క్లాప్' కొట్టు గురూ!
బాలీవుడ్‌పై మోజు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ‘గౌరవం’ చిత్రం ద్వారా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ‘మిక్కీ డోనర్’ చిత్రం ఫేమ్ యామీ గౌతమ్‌ని మరచిపోలేదు కదా. ఈ భామకు ఎప్పుడూ వార్తల్లో ఉండడమే ఇష్టంగా ఉన్నట్లుంది. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. సినిమా అవకాశాలు సరిగా లేకున్నా మీడియా దృష్టిలో మాత్రం ఎప్పుడూ హాట్ హాట్‌గానే చోటు సంపాదించుకుంటుంది. బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో ‘సనమ్‌రే’ చిత్రంలో నటించినప్పుడే అతడితో ప్రేమాయణంలో మునిగితేలిందని అప్పుడు పుకార్లు బాగానే షికారు చేశాయి. అప్పటికే పెళ్లయిన పుల్కిత్ తన భార్యకు విడాకులిచ్చి దూరంగా వున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ యామీకి కూడా గుడ్‌బై చెప్పేశాడని బాలీవుడ్ అంతా కోడై కూస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ..యామీతో ప్రేమాయణం వల్ల బాలీవుడ్‌లో క్రేజ్ తగ్గుతుందని భావించిన అతడు ఈ బ్యూటీకి దూరంగా ఉంటున్నట్లు అతడి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అయితే యామీ మాత్రం తాజాగా తన దృష్టిని బాలీవుడ్ వైపే సారించి అక్కడ తానేంటో నిరూపించుకోవాలనుకుంటుంది. వాహ్..యామీ!!
ఇక బిజీ బిజీయే!
నిజంగా లావణ్య త్రిపాఠి ‘అందాల రాక్షసి’యే! ఎందుకంటే చేసినవి నాలుగు చిత్రాలే అయినా అందులో టాప్‌స్టార్ నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయన’లో ఓ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ‘అందాల రాక్షసి’ని అంటూ టాలీవుడ్‌లోకి ఎన్నో ఆశలు, ఆశయాలతో అడుగుపెట్టి అటు తర్వాత ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’, ‘్భలే భలే మగాడివోయ్’లాంటి చిత్రాల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. తాజాగా అల్లు శిరీష్‌తో ఓ చిత్రంతో పాటు మార్చిలో తెరకెక్కే మరో చిత్రంలోనూ నటించడానికి అంగీకారం తెలిపింది. అతి తక్కువ కాలంలోనే అగ్రహీరో నాగార్జునతో నటించడం ఎలా అనిపించింది అని లావణ్యను కదిలిస్తే- ‘‘ఆ అరుదైన అవకాశం నాకు ఇంత త్వరగా లభిస్తుందనుకోలేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగార్జునతో పాటు సీనియర్ నటి రమ్యకృష్ణతో కలిసి నటించడం గొప్ప అనుభూతికి లోనయ్యాను. అంతే కాదు, ‘లావణ్య గుడ్ జాబ్’ అని నాగార్జునగారు కాంప్లిమెంట్ ఇవ్వడం అంతకంటే మరచిపోలేను. అలాగే రమ్యకృష్ణకు నేను గొప్ప అభిమానిని. దర్శకుడు వారిద్దరి మధ్య నా క్యారెక్టర్‌ను పండించిన తీరు గొప్పగా అనిపించింది. దర్శకుడు కళ్యాణ్ కొత్తవాడైనా నా పాత్రనే కాదు, సినిమాను ఎంతో చక్కగా తీశారు. ఇప్పుడిప్పుడే నాకు మంచి మంచి అవకాశాలను తలుపుతడుతున్నాయి. త్వరలోనే మరిన్ని చిత్రాలను అంగీకరించనున్నాను. ఇక నా కెరీర్ బిజీ బిజీగానే సాగుతుందనుకుంటున్నాను’’అంటూ చెప్పుకొచ్చింది ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. అదీ..సంగతీ!!
అమ్మో..జాక్సన్!
టాలీవుడ్‌లో రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘ఎవడు’ చిత్రంలో అతడి సరసన గ్లామర్‌ని చిందించిన అందాలభామ అమీజాక్సన్ గుర్తుంది కదా! అటు తర్వాత కోలీవుడ్‌లోనూ విక్రమ్ ‘ఐ’తో సంచలన తారగా అక్కడా గుర్తింపు తెచ్చుకుంది. విక్రమ్ ‘ఐ’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టినా, అమీజాక్సన్‌కు మాత్రం నటిగా మంచి మార్కుల్నే తెచ్చిపెట్టింది. విక్రమ్ సరసన అమీ హావభావాలు అందరికీ నచ్చాయి. తెలుగు ప్రేక్షకులకే కాదు, తమిళ తంబిలకు కూడా అమీజాక్సన్ బాగానే దగ్గరయింది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది కాబట్టే దర్శకుడు శంకర్ కోలీవుడ్‌లో మరో అవకాశం కూడా ఇచ్చాడు. తను తీయబోయే క్రేజీ మరో క్రేజీ ప్రాజెక్టులో అమీకి అవకాశం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు శంకర్. అంతేకాదు రజనీ సరసన తొలిసారి జతకట్టనుంది ఈ కెనడా బ్యూటీ. అయితే ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ హాట్ హాట్‌గా అందరి మనసుల్ని కొల్లగొట్టేసిన అమీ బాయ్‌ఫ్రెండ్‌తో తెగ తిరుగుతుందని పుకారు షికారు చేస్తోంది. అవునా ఇందులో నిజమెంత? అని అమీని ప్రశ్నిస్తే- ‘‘ఎదిగిన తారలపై ఇలాంటి రూమర్స్ మామూలే అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే నామీద కూడా అలాంటి రూమర్సే వస్తున్నాయి. ఇవన్నీ నేనేమీ పట్టించుకోను’’ అంటూ తేలిగ్గా కొట్టిపారేసింది అమీ. అమ్మో... నిజంగా జాక్సన్ గుడుసుపిల్లే సుమా!!