కృష్ణ

1 నుంచి పుస్తక పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , డిసెంబర్ 22: పుస్తక పఠనావశ్యకతను తెలిపేందుకు, పఠనాభిలాష పెంపొందించేందుకు, సమాజంలో పుస్తకం ద్వారా విజ్ఞాన వెలుగులు నింపేందుకు 26 ఏళ్లుగా క్రమం తప్పక జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, అదే క్రమాన్ని పాటిస్తూ పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని స్వాగతిస్తూ జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు 27వ పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు బి బాబ్జీ అన్నారు. మంగళవారం ఉదయం గవర్నర్‌పేటలోని సొసైటీ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాజ్ మైదానంలో 234 స్టాల్స్‌తో కళకళలాడే ఈ పుస్తక మహోత్సవం స్వరాజ్ మైదానంలో కొనసాగుతుందని అన్నారు. ఈ 27వ పుస్తక మహోత్సవ ప్రాంగణానికి ప్రముఖ ప్రచురణకర్త మువ్వల (జయంతి) పెరుమాళ్లు పేరు పెడుతున్నట్లు, మహోత్సవ ప్రాంగణంలో జరిగే వివిధ సాహిత్య కార్యక్రమాల వేదికకు ప్రఖ్యాత సాహితీ విమర్శకులు చలసాని ప్రసాద్ పేరు పెడుతున్నట్లు తెలిపారు. మూడవ పుస్తక మహోత్సవం నుంచి ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పుస్తక ప్రియుల పాదయాత్ర జనవరి 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు గాంధీనగరం ప్రెస్‌క్లబ్ నుంచి పుస్తక మహోత్సవ ప్రాంగణం వరకు సాగుతుందని అన్నారు. 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు బుచ్చిబాబు శత జయంతి సభ, 6వ తేదీ సాయంత్రం గురజాడ 100వ వర్ధంతి సభ జరుగుతుందని అన్నారు. 9వ తేదీ సాయంత్రం పుస్తకావిష్కరణ సభకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విచ్చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 150 ప్రచురణకర్తలు, విక్రేతలు స్టాల్స్ తీసుకున్నారని 11వ తేదీ సాయంత్రంతో మహోత్సవం ముగుస్తుందని అన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని, ఎటువంటి ప్రవేశ రుసుము లేదని, అందరూ సద్వినియోగపరచుకోవాలని అన్నారు. జనవరి 1వ తేదీ ఉత్సవాన్ని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభిస్తారని అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ సభకు అధ్యక్షత వహించగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఎంపి కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మేయర్ కొనేరు శ్రీ్ధర్ తదితర ప్రముఖులు ప్రారంభ సభలో పాల్గొంటారని అన్నారు. పూర్వ కార్యదర్శి వెంకట నారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది పుస్తక మహోత్సవ ఏర్పాట్లకు సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. మహోత్సవం పుస్తకాలు అమ్మటానికి కాదని అన్నారు. ప్రచురణ రంగం చాలా కష్టతరమైనదని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం ఇనే్నళ్లుగా తమ సొసైటీకి ఎటువంటి సాయం ఇవ్వలేదని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు కె లక్ష్మయ్య, కార్యదర్శి ఎబిఎస్ సాయిరామ్, సంయుక్త కార్యదర్శి బి రవికుమార్, విజిఎస్ రామారావు పాల్గొన్నారు.