కృష్ణ

విఎంసి టౌన్‌ప్లానింగ్‌లో బ్రోకర్లదే రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , మార్చి 7: విజయవాడ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో బ్రోకర్లదే రాజ్యంగా కనబడుతోంది. నానాటికీ అధికమవుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టినా బ్రోకర్ల హడావుడిని నిలువరించలేకపోతున్న వైనం గమనార్హం. కాగా కోట్లాది రూపాయల వ్యయంతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్‌లైన్ సిస్టమ్ వలన భవన యజమానుల కన్నా బ్రోకర్లకే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ లో సిటీ ప్లానర్ కన్నా చైన్‌మెన్లదే ఎక్కువ హడావుడి కనబడుతోంది. నగర పరిధిలో ఎక్కడ అనధికార నిర్మాణం కనిపించినా చైన్‌మెన్ జేబు నిండినట్టే. అనధికార, అక్రమ నిర్మాణాల విషయం పక్కన పెడితే ప్లాన్ తీసుకొన్న భవన నిర్మాణాల్లోనూ చైన్‌మెన్లతోపాటు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల అవినీతి చర్యలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ప్లాన్‌కు ధరఖాస్తు చేసిన ప్రతి బిల్డింగ్‌ను వీరిద్దరూ పరిశీలించాల్సి ఉంది. ఈనేపథ్యంలో ప్లాన్ మంజూరు కావాలంటే వీరి కరణా కటాక్షాలు ఉండాల్సిందేనంటే అందులోని పరమార్థం వేరే చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ దినచర్యల్లో బిపిఎస్ పరిశీలనలు ముఖ్య విధిగా ఉంది. బిపిఎస్ కోసం దరఖాస్తు చేసుకొన్న బిల్డింగ్‌ను విధిగా చైన్‌మెన్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేసి ఆ భవనాన్ని ఎంత క్రమబద్దీకరించాలి, ఎంత ఫీజు నిర్ణయించాలన్నది వీరి చేతుల్లోనే ఉంది. ఈచర్యల్లోనూ వారు పాల్పడుతున్న అవినీతి చర్యలకు అవధుల్లేకుండా ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌పై విఎంసి కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అనధికార నిర్మాణాలపై ఎంతో కఠినంగా ఉన్న విఎంసి అధికారులు తమ పట్టును కోల్పోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి. ఇటీవల కొద్ది రోజుల క్రితం నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ పనితీరుపై బహిరంగానే విమర్శలు చేసినా సెక్షన్ తీరు మెరుగుపడకపోవడాన్ని పరిశీలిస్తే నగర పాలన ఏ విధంగా జరుగుతుందో ఇట్టే చెప్పవచ్చు.