బిజినెస్

అమెరికా సంపన్నుల్లో ప్రవాస భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 9: అమెరికాలోని సంపన్నుల జాబితాలో ఐదుగురు ప్రవాస భారతీయులున్నారు. 400 మందితో ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో వరుసగా 23వసారి మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అగ్రస్థానంలో ఉండగా, 60 ఏళ్ల గేట్స్ సంపద విలువ 81 బిలియన్ డాలర్లు.
ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇండో-అమెరికన్ల విషయానికొస్తే సింఫనీ టెక్నాలజీ వ్యవస్థాపకుడు రోమేశ్ వాద్వాని, ఔట్‌సోర్సింగ్ సంస్థ సింటెల్ భారత్ సహ వ్యవస్థాపకులు భరత్ నీర్జా దేశాయ్, యుఎస్ ఎయిర్‌వేస్ గ్రూప్ మాజీ సిఇఒ రాకేశ్ గంగ్వాల్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త జాన్ కపూర్, సిలికాన్ వ్యాలీ ఏంజెల్ ఇనె్వస్టర్ కవితర్క్ రామ్ శ్రీరామ్ ఉన్నారు. వీరిలో వాద్వాని మూడు బిలియన్ డాలర్లతో 222వ స్థానంలో, 2.5 బిలియన్ డాలర్లతో దేశాయ్ 274వ స్థానంలో, 2.2 బిలియన్ డాలర్లతో గంగ్వాల్ 321వ స్థానంలో, 2.1 బిలియన్ డాలర్లతో కపూర్ 335వ స్థానంలో, 1.9 బిలియన్ డాలర్లతో శ్రీరామ్ 361వ స్థానంలో ఉన్నారు. ఇదిలావుంటే ఈ జాబితాలో అమెజాన్ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు, సిఇఒ జెఫ్ బెజోస్ 67 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, బెర్క్‌షైర్ హాత్‌వే సిఇఒ వారెన్ బఫెట్ 65.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, ఫేస్‌బుక్ సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ 55.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అల్ఫాబెట్ సిఇఒ లర్రీ పేజ్ 38.5 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో, డెల్ సిఇఒ మిచెల్ డెల్ 20 బిలియన్ డాలర్లతో 20వ స్థానంలో నిలిచారు.
ట్రంప్ సంపద
వలసవాదుల కంటే తక్కువే
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ సంపద విలువ ఈ జాబితాలో పలువురి వలసవాదుల సంపద కంటే తక్కువగానే ఉండటం విశేషం. అమెరికాలో వలసలకు వ్యతిరేకంగా తన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తీవ్ర స్వరాన్ని వినిపిస్తున్నది తెలిసిందే.
ఈ క్రమంలో విడుదలైన ఫోర్బ్స్ జాబితాలో వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినవారి సంపద కంటే అమెరికా పౌరుడైన 70 ఏళ్ల ట్రంప్ సంపద తక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు నిరుడుతో పోల్చితే ఈ ఏడాది 35 స్థానాలు దిగజారారు ట్రంప్. పోయినసారి 121వ స్థానంలో ఉంటే, ఈసారి 156కు పడిపోయారు. నిరుడు 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రంప్ సంపద విలువ.. ఈ ఏడాది 3.7 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఏడాది కాలంలో 800 మిలియన్ డాలర్లు తగ్గిందన్నమాట. ఇకపోతే 400 మందితో రూపొందిన ఫోర్బ్స్ అమెరికా కుబేరుల తాజా జాబితాలో 21 దేశాలకు చెందినవారికి చోటు దక్కింది. ఇజ్రాయెల్‌కు చెందినవారు ఆరుగురుండగా, భారత్‌కు చెందినవారు ఐదుగురు, హంగేరీ, తైవాన్ దేశాలకు చెందినవారు నలుగురు చొప్పున ఉన్నారు.
మొత్తం జాబితాలోని 400 వందల మంది సంపద విలువ దాదాపు 250 బిలియన్ డాలర్లు. ఇక వలసవాదుల్లో గూగుల్ సహవ్యవస్థాపకుడు, అల్ఫాబెట్ అధ్యక్షుడు సిర్గే బ్రిన్ 37.5 బిలియన్ డాలర్లతో ముందుండగా, ట్రంప్ కంటే 14 మంది వలసవాదుల ఆస్తులు అధికంగా ఉన్నాయి.