బిజినెస్

లండన్‌లో అమ్మకానికి అరుదైన ఇజ్నిక్ పింగాణీ ఫలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 12: పదహారవ శతాబ్దానికి చెందిన అరుదైన ఇజ్నిక్ పింగాణీ ఫలకం ఒకటి లండన్‌లోని బోన్‌హామ్స్ సంస్థ ఈ నెల 18న వేలం వేయనున్న ఇస్లామిక్, భారతీయ కళాఖండాల్లో ఉంది.
క్రీస్తు శకం 1580 దశకానికి చెందినదిగా భావిస్తున్న ఈ పింగాణీ ఫలకం వేలంలో 25 వేల నుంచి 35 వేల పౌండ్లు (్భరతీయ కరెన్సీలో 20.37 లక్షల నుంచి 28.51 లక్షల రూపాయలు) పలకవచ్చని భావిస్తున్నారు. బట్టీలో కాల్చడానికి ముందు ఫలకం మెరుపుగా ఉండే వైపున ఉండే డిజైన్ అవుట్‌లైన్ కోసం వాడే క్రోమ్‌బ్లాక్ రంగు షేడ్లు మిగతా వాటికన్నా భిన్నంగా అత్యంత ప్రత్యేకమైనవిగా ఉండడమే ఈ పింగాణీ ఫలకం అంత ధర పలకడానికి కారణం.
ఒక ప్రత్యేకమైన ఎఫెక్ట్ రావడం కోసమో లేదా మెరుపు కోసం వాడే రసాయనాలను పూయడానికి ముందు కళాకారుడు అవుట్ లైన్ వేయడాన్ని పూర్తి చేయడం మరిచి పోయి ఆ తర్వాత తన తప్పును సరిదిద్దుకోవడం వల్లనో ఇలాంటి ప్రత్యేకమైన షేడ్లు వచ్చి ఉండవచ్చని, ఏదేమైనటికీ దానివల్ల ఓ ప్రత్యేకమైన ఎఫెక్ట్ వచ్చిందని బోన్‌హామ్స్‌లో భారతీయ, ఇస్లామిక్ కళా విభాగం అధిపతి ఆలివర్ వైట్ అభిప్రాయపడుతున్నారు. ఆ సంస్థ సేకరించిన ఇస్లామిక్ దేశాల్లోని ఇజ్నిక్, కషన్ లాంటి ఇతర మట్టి పాత్రల తయారీ కేంద్రాలకు చెందిన అరుదైన కళాఖండాలలో ఇదొకటి. ఆధునిక టర్కీలోని ఒక భాగమైన ఇజ్నిక్ 16వ శతాబ్దంలో గృహోపకరణాలు మొదలుకొని కళాఖండాల వరకు మట్టి పాత్రల తయారీ కేంద్రంగా ఉండేది. ఆనాటి ఒట్టోమన్ రాజవంశీకుల ప్రోత్సాహంతో ఇక్కడి కళాకారులు పింగాణీ ఫలకాలు తయారు చేయడం ప్రారంభించారు. ప్రారంభంలో చైనీస్ నీలి, తెలుపు పోర్సలిన్‌తో వీరు పింగాణీ ఫలకాలు తయారు చేసేవారు. వీటిపై రకరకాల డిజైన్లు ఉండేవి. 6వ శతాబ్దం చివరి నాటికి ఎరుపు, ముదురు నీలం లాంటి ముదురు రంగులు, లేత ఊదారంగు లాంటివి కూడా వాడేవారు.
అయితే కాలక్రమంలో భారీ అగ్ని ప్రమాదాలు, 17వ శతాబ్ద ప్రారంభంలో ఒట్టోమాన్ సామ్రాజ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం లాంటి కారణాలతో ఈ కళ అంతరించి పోయింది. కాగా, ఈ వేలంలో అదే కాలానికి చెందిన మరో రెండు అరుదైన పింగాణీ ఫలకాలను సైతం వేలం వేయనున్నారు.