బిజినెస్

కోలుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 14: ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాల కారణంగా గురువారం భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వల్ప లాభాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌ల కారణంగా సెనె్సక్స్ తిరిగి పుంజుకుని 30 పాయింట్ల లాభంతో ముగిసింది. అయితే త్రైమాసిక ఫలితాలు వెలువడ్డం మొదలైన నేపథ్యంలో అవి మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో లాభాలు పరిమితంగానే ఉన్నాయి. కాగా, నిన్న త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన టిసిఎస్ షేరు 1.6 శాతం పెరగ్గా, ఈ రోజు ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ షేరు 2.3 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. ఈ రెండు కంపెనీల ఫలితాలు కూడా బాగానే ఉన్నా మార్కెట్ అంచనాల మేరకు లేకపోవడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 వాతానికి, టోకు ధరల ద్రవ్యోల్బణం 3.57 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్‌బిఐ మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న ఆంచనాలతో ఇనె్వస్టర్లలో ఉత్సాహం నెలకొనింది. దీనికి తోడు చైనా ద్రవ్యోల్బణం గణాంకాలు సైతం ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై ఉన్న భయాలను పోగొట్టే విధంగా ఉండడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల ధోరణులు వ్యక్తం కావడం కూడా దేశీయంగా ఇనె్వస్టర్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఫలితంగా శుక్రవారం 27,712.22 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత ఒక దశలో 27,763 పాయింట్ల దాకా పెరిగింది. అయితే పై స్థాయిలో లాభాల స్వీకరణ కారణంగా ఆ లాభాలు చాలావరకు ఆవిరి కాగా, చివరికి 30.49 పాయింట్ల లాభంతో 27,673.60 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 10 పాయింట్ల లాభంతో 8583.40 పాయింట్ల వద్ద ముగిసింది. గెయిల్, ఎల్‌అండ్‌టి, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్, ఒఎన్‌జిసి, అదానీ పోర్ట్స్, ఎస్‌బిఐ, సిప్లా, సన్‌ఫార్మా, ఎన్‌టిపిసి, యాక్సిస్‌బ్యాంక్ షేర్లు మంచి లాభాలు ఆర్జించగా,ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, లుపిన్, మహింద్ర, మహింద్ర, కోల్‌ఇండియా షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలోప్రధాన సూచీలు లాభాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలో లాభాల బాటలో సాగాయి.