బిజినెస్

కాలుష్య కారక ఉత్పత్తులపై మరింత పన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్వాడా (గోవా), అక్టోబర్ 14: దేశంలో వాతావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధులను సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోందని, కనుక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చిన తర్వాత ఇతర ఉత్పత్తులపై వసూలు చేసే పన్ను కంటే పర్యావరణానికి మేలు చేయని కాలుష్య కారక ఉత్పత్తులపై వసూలు చేసే పన్ను ఎక్కువగా ఉండవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. జిఎస్‌టి అమలుకు సంబంధించి తాము చర్చిస్తున్న ప్రతిపాదనల్లో ఈ ప్రతిపాదన కూడా ఉందని ఆయన వెల్లడించారు. పారిస్‌లో వాతావరణ పరిరక్షణ ఒప్పందంపై భారత్ సంతకం చేసిన కొద్ది రోజులకే ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల శిఖరాగ్ర సమావేశం శనివారం ఇక్కడ ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం జైట్లీ మాట్లాడుతూ, వస్తు, సేవల పన్ను రేట్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. దేశంలో బొగ్గు, పెట్రోలియం వంటి కాలుష్య కారక ఉత్పత్తులపై ఇంతకుముందు నుంచే పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని జైట్లీ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, వాతావరణ పరిరక్షణ కార్యక్రమాల కోసం అన్ని మార్గాల నుంచి వనరులను సమీకరించడం ద్వారా స్థిరమైన దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు. వాతావరణ పరిరక్షణ కార్యక్రమాల కోసం పేద, వర్థమాన దేశాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తామని అభివృద్ధి చెందిన దేశాలు భారీ హామీలు గుప్పించినప్పటికీ, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ ఏమాత్రం నిధులు సరిపోవని, కనుక ఈ విషయంలో కేవలం ప్రభుత్వాలే కాకుండా బహుళజాతి సంస్థలు కూడా సాయమందించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా పాల్గొన్నారు.